రెండు దేశాల తరుపున వరల్డ్ కప్ ఆడిన కెప్లర్ వెసెల్స్... ఒకే బంతికి 22 పరుగులు చేయాల్సి రావడంతో...

Published : Aug 07, 2023, 05:37 PM IST

ఒక దేశం తరుపున సరైన అవకాశాలు రానప్పుడు దేశం మారి, వేరే దేశానికి ఆడడం సర్వ సాధారణం. ఇంగ్లాండ్‌కి వన్డే వరల్డ్ కప్ 2019 అందించిన ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్‌కి ఆడాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్‌లో పుట్టాడు.. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు కెప్లర్ వెసెల్స్.

PREV
110
రెండు దేశాల తరుపున వరల్డ్ కప్ ఆడిన కెప్లర్ వెసెల్స్... ఒకే బంతికి 22 పరుగులు చేయాల్సి రావడంతో...

1957లో సౌతాఫ్రికాలో జన్మించిన కెప్లర్ వెసెల్స్, 1982లో ఆస్ట్రేలియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు..

ఆస్ట్రేలియా తరుపున ఆడిన మొట్టమొదటి సౌతాఫ్రికా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెప్లర్ వెసెల్స్. ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ బాదిన కెప్లర్ వెసెల్స్, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 162 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

210

1983 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా తరుపున ఆడిన కెప్లర్ వెసెల్స్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగులు చేసి ఓటమి నుంచి తప్పించాడు. అయితే ఆ తర్వాత వెస్టిండీస్, ఇండియాతో జరిగిన మ్యాచుల్లో కెప్లర్ వెసెల్స్ ఫెయిల్ అవ్వడంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు..

310

1985లో ఆస్ట్రేలియా జట్టు, సౌతాఫ్రికా రెబల్ టూర్‌కి వెళ్లింది. జాతి వివక్ష ఆరోపణలతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై బ్యాన్ విధించిన సమయంలో జరిగిన ఈ పర్యటనతో మనస్థాపం చెందిన కెప్లర్ వెసెల్స్, ఆస్ట్రేలియా క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు..

410

1986లో ఆస్ట్రేలియాకి రిటైర్మెంట్ ఇచ్చిన కెప్లర్ వెసెల్స్, 1991లో సౌతాఫ్రికా జట్టుకి మారాడు. సఫారీ జట్టుపై ఐసీసీ విధించిన బ్యాన్‌ని ఎత్తివేయడంతో 1992 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సౌతాఫ్రికాకి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెప్లర్ వెసెల్స్. అప్పటికి క్లైయివ్ రైస్, జిమ్మీ కుక్ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్లేయర్లు మాత్రమే టీమ్‌లో ఉన్నారు..
 

510

అయితే ఈ ఇద్దరినీ టీమ్‌ నుంచి తప్పించిన కెప్లర్ వెసెల్స్, యువకులతో నిండిన జట్టును, 1992 వన్డే వరల్డ్ కప్‌లో నడిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచి సంచలనం క్రియేట్ చేసింది కెప్లర్ వెసెల్స్ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా టీమ్..

610

అయితే ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, శ్రీలంక చేతుల్లో ఓడిన సౌతాఫ్రికా, ఆ తర్వాత వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్, జింబాబ్వేలపై గెలిచి ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఓడిపోయారు... ఇండియాతో జరిగిన తప్పక గెలవాల్సిన ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్ చేరింది సౌతాఫ్రికా...
 

710

అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌కి 4 రోజుల ముందు సౌతాఫ్రికా అధ్యక్షుడు ఫెడ్రిక్ విలియం డి క్లర్క్ దేశంలో రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న సౌతాఫ్రికా జట్టు, ఓటింగ్ కోసం స్వదేశానికి వెళ్లింది, ఓటింగ్ తర్వాత మళ్లీ వరల్డ్ కప్‌లో పాల్గొంది..

810

ప్రాక్టీస్ లేకుండా సెమీస్ ఆడినా విజయానికి చేరువగా వచ్చింది. అయితే సౌతాఫ్రికా విజయానికి 13 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన సమయంలో వర్షం కురిసింది. వర్షం కారణంగా 2 ఓవర్ల ఆట రద్దు కావడంతో ఆట తిరిగి ప్రారంభమైనా సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాలని రిఫరీ నిర్ణయించారు... అసాధ్యమైన టార్గెట్ కారణంగా సౌతాఫ్రికా 19 పరుగుల తేడాతో ఓడి, వరల్డ్ కప్ నుంచి నిష్కమించింది.. 

910

వర్షం ఆగిన తర్వాత బంతులు తగ్గినప్పుడు చేయాల్సిన లక్ష్యం ఎందుకు తగ్గలేదనే ప్రశ్న, క్రికెట్ ప్రపంచంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.  వరల్డ్ కప్ చరిత్రలో ఇదో నాటకీయ పరిణామంగా మిగిలిపోయింది.. ఈ పరిణామాలతోనే వర్షం కారణంగా అంతరాయం కలిగే మ్యాచుల్లో లక్ష్యాన్ని నిర్ణయించేందుకు డక్ వర్త్ లూయిస్ పద్ధతిని 1997లో ప్రవేశపెట్టింది ఐసీసీ. 

1010

సౌతాఫ్రికాపై ఛీటింగ్ చేసి గెలిచి ఫైనల్ చేరిన ఇంగ్లాండ్, 1992 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో 22 పరుగుల తేడాతో ఓడింది. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు, మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. 

click me!

Recommended Stories