ఐపీఎల్‌లో 8 సీజన్ల గ్యాప్‌లో ఐదు టైటిల్స్ గెలిచాడు రోహిత్ శర్మ. ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ అప్పగించాలని అభిమానులు గోల గోల చేశారు. ఇదే నిజమని నమ్మిన బీసీసీఐ, విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది..
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి రాజీనామా ఇచ్చిన విరాట్ కోహ్లీ, వన్డే, టెస్టు ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగుతానని చెప్పాడు. అయితే అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించింది బీసీసీఐ. ఈ మనస్థాపంతో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ..
28
స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వరకూ వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యం వహించబోతున్నాడు. దీంతో విరాట్ ఫ్యాన్స్, రోహిత్ శర్మపై తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నారు..
38
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో, అంతకుముందు ఆసియా కప్ 2022 టోర్నీలో రోహిత్ సేన పెద్దగా రాణించలేకపోయింది. రోహిత్ శర్మ కూడా బ్యాటర్‌గా ఫెయిల్ అయ్యాడు. ఈ రెండు టోర్నీల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...
48
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వెస్టిండీస్ టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీకి ఒక్కసారి కూడా బ్యాటింగ్ రాలేదు. అనవసర ప్రయోగాలతో ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టింది మేనేజ్‌మెంట్..
58
Image credit: PTI
‘ప్రస్తుతానికి మా లక్ష్యం 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ మాత్రమే. మాలో కొందరు ప్లేయర్లు, ఈ వయసులో మూడు ఫార్మాట్లలోనూ ఆడలేదు. బిజీ షెడ్యూల్, బ్యాక్ టు బ్యాక్ మ్యాచుల కారణంగా కొందరు ప్లేయర్లపై వర్క్ లోడ్ తగ్గిచేందుకు విశ్రాంతినిచ్చాం...
68
Mohammed Shami
నేను కూడా ఇదే కేటగిరిలోకి వస్తాను. టీ20 ఫార్మాట్ ఆడనంత మాత్రాన టీ20ల నుంచి రిటైర్మెంట్ ఇచ్చినట్టు కాదు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలోనూ కచ్ఛితంగా ఆడతాను..’ అంటూ వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ..
78
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయగా రోహిత్ శర్మ ప్రస్తుతం యూఎస్‌ఏలో ఉన్నాడు. అక్కడ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన రోహిత్, త్వరలో స్వదేశానికి రాబోతున్నాడు. ఈ నెలఖరులో ఆసియా కప్ 2023 టోర్నీ శ్రీలంకకి వెళ్లనుంది భారత జట్టు..
88
ఆసియా కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం వార్మప్ మ్యాచులు మొదలైపోతాయి..