సౌతాఫ్రికా టూర్‌కి ముందు భారత జట్టుకి కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి. కేవలం ఓపెనింగ్ పొజిషన్ కోసం ఏకంగా నలుగురు పోటీలో నిలిచారు. మిడిల్ ఆర్డర్‌లో ఐదో స్థానం కోసం మరో ముగ్గురు పోటీలో నిలిచారు. అయితే టూర్ ఆరంభానికి ముందే పోటీ క్లియర్ అయిపోయింది...
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్నప్పటికీ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి ఎంపిక కాలేదు...
210
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సెంచరీతో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మల మధ్యే ఓపెనింగ్ ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ నడిచింది...
310
ఇంగ్లాండ్ టూర్‌లో ఆకట్టుకోవడంతో రోహిత్ శర్మతో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని, మయాంక్ అగర్వాల్ సెంచరీ చేసి ఆకట్టుకున్నా అతను రిజర్వు బెంచ్‌కి పరిమితం కావాల్సిందే అనుకున్నారంతా...
410
అయితే సఫారీ టూర్‌కి ముందు రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి దూరం కావడంతో మయాంక్ అగర్వాల్‌కి లైన్ క్లియర్ అయిపోయింది...
510
సౌతాఫ్రికాపై మయాంక్ అగర్వాల్‌కి మంచి రికార్డు ఉంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన గత సిరీస్‌లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో ఆకట్టుకున్నాడు మయాంక్ అగర్వాల్...
610
మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమైపోగా రోహిత్ శర్మ స్థానంలో జట్టులో స్థానం దక్కించుకున్న ప్రియాంక్ పంచల్, తుదిజట్టులోకి రావాలంటే అవకాశం క్రియేట్ కావాల్సిందే...
710
ఈ ఇద్దరు ఓపెనర్లలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో ప్రియాంక్ పంచల్‌కి అవకాశం దక్కొచ్చు. ఇప్పటికే 100 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన 31 ఏళ్ల ప్రియాంక్ పంచల్, భారత్-ఏ జట్టు కెప్టెన్‌గా సౌతాఫ్రికా పిచ్‌లపై రాణించగలనని నిరూపించుకున్నాడు...
810
ఇక మిడిల్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ముగ్గురు పోటీపడుతున్నారు. ఫామ్‌లో లేని అజింకా రహానేతో పాటు శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి మధ్య ఈ ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ ఉంది...
910
అయితే ఛతేశ్వర్ పూజారా మొదటి రెండు టెస్టుల్లో విఫలమైతే శ్రేయాస్ అయ్యర్ లేదా హనుమ విహారిలను మూడో స్థానంలో ఆడించేందుకు కూడా టీమిండియా ప్రయత్నించవచ్చని టాక్ వినబడుతోంది...
1010
ఇప్పటికే వరుసగా విఫలం అవుతూ టెస్టు వైస్ కెప్టెన్సీ కోల్పోయిన అజింకా రహానేకి ఇదే ఆఖరి అవకాశమని ప్రచారం జరుగుతోంది. కాబట్టి అతని తొలి టెస్టులో అవకాశం వచ్చి, విఫలమైతే మిగిలిన టెస్టుల్లో అతను కనిపించకపోవచ్చు...