రవీంద్ర జడేజా షాకింగ్ నిర్ణయం... దాని కోసం టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని...

Published : Dec 14, 2021, 09:57 AM IST

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నాడట. వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ కాలం కొనసాగేందుకు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట జడ్డూ...

PREV
110
రవీంద్ర జడేజా షాకింగ్ నిర్ణయం... దాని కోసం టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని...

మూడు ఫార్మాట్లలోనూ బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గానే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతోనూ ఆకట్టుకుంటూ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు రవీంద్ర జడేజా...

210

అయితే ఈ మధ్యకాలంలో రవీంద్ర జడేజాను గాయాలు తెగ విసిగిస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్‌లో ఏకంగా రెండు సార్లు గాయపడి జట్టుకి దూరమయ్యాడు రవీంద్ర జడేజా...

310

మొదటి టీ20 సమయంలో రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా యజ్వేంద్ర చాహాల్ జట్టులోకి వచ్చి బౌలింగ్ చేసి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు..

410

ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని రెండో టెస్టులో బరిలో దిగిన రవీంద్ర జడేజా, సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా దాదాపు మూడు నెలల పాటు జట్టుకి దూరమయ్యాడు జడ్డూ...

510

తాజాగా కాన్పూర్ టెస్టులో గాయపడిన రవీంద్ర జడేజా, ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్‌ ఆడలేకపోయాడు. అతని స్థానంలో జయంత్ యాదవ్‌ తుదిజట్టులో అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే...

610

గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా సౌతాఫ్రికా టూర్‌లో జరిగే మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కి కూడా దూరమయ్యాడు రవీంద్ర జడేజా...

710

శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజాతో పాటు టెస్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ కూడా గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కి దూరమయ్యారు...

810

తరుచూ గాయపడుతూ టీమిండియాకి దూరమవుతూ ఉండడంతో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నాడట రవీంద్ర జడేజా...

910

ఇప్పటికే భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, టెస్టు ఫార్మాట్‌కి దూరమయ్యాడు. తరుచూ గాయపడుతుండడంతో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు జడ్డూ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం...

1010

33 ఏళ్ల రవీంద్ర జడేజా, ఇప్పటికే 56 టెస్టుల్లో 2145 పరుగులు చేయడమే కాకుండా 223 వికెట్లు పడగొట్టాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తున్న జడ్డూ, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడమే బెటర్ అని అనుకుంటున్నాడట...

click me!

Recommended Stories