కెప్టెన్‌కి నచ్చినవాళ్లకే టీమ్‌లో చోటు... షోయబ్ మాలిక్ ట్వీట్! స్పందించిన ఇంజమామ్ వుల్ హక్...

Published : Sep 15, 2022, 12:02 PM ISTUpdated : Sep 15, 2022, 12:05 PM IST

టీ20ల్లో 100 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన మొట్టమొదటి క్రికెటర్ షోయబ్ మాలిక్. 40 ఏళ్ల షోయబ్ మాలిక్, 2007 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతీ టీ20 వరల్డ్ కప్ ఆడాడు. అయితే అతనికి 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. 23 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న షోయబ్ మాలిక్, టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

PREV
17
కెప్టెన్‌కి నచ్చినవాళ్లకే టీమ్‌లో చోటు... షోయబ్ మాలిక్ ట్వీట్! స్పందించిన ఇంజమామ్ వుల్ హక్...
Mohammad Rizwan and Shoaib Malik

ఆసియా కప్‌ 2022 టోర్నీలో భారత్, ఆఫ్ఘాన్‌లపై ఘన విజయాలు అందుకుని ఫైనల్ చేరిన పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫామ్‌లో లేని శ్రీలంక చేతుల్లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌లో సీనియర్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్‌కి చోటు దక్కలేదు.

27
Shoaib Malik

‘ఫ్రెండ్‌షిప్, నచ్చినవాళ్లు, నచ్చనివాళ్లు... ఈ సంస్కృతి నుంచి బయటికి వచ్చినప్పుడే విజయాలు వచ్చాయి. న్యాయంగా నడుచుకున్నవాళ్లకి ఆ దేవుడు ఎప్పుడూ సాయం చేస్తాడు...’ అంటూ ట్వీట్ చేశాడు పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్. టీమ్ సెలక్షన్‌లో అన్యాయం జరుగుతోందని నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా కామెంట్ చేశాడు మాలిక్...

37

‘టీమ్ సెలక్షన్ విషయంలో ఇలాంటి ఆరోపణలు ఇంతకుముందు కూడా వచ్చాయి, ఇకపై వస్తాయి కూడా.. అయితే టీమ్ సెలక్షన్ అనేది ఒక్క వ్యక్తి చేసే పని కాదని మనం తెలుసుకోవాలి... టీమ్‌ని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఉంటారు.

47

హెడ్ కోచ్, కెప్టెన్ చెప్పినవాళ్లకు టీమ్‌లో చోటు దక్కుతుంది. అయితే టీమ్ సెలక్షన్‌లో ఫ్రెండ్‌షిప్‌ గురించి నేను కామెంట్ చేయను. ఎందుకంటే ప్రతీ చోట నచ్చినవాళ్లను సెలక్ట్ చేయడం, నచ్చనివాళ్లను పక్కనబెట్టడం జరుగుతుంది...

57

నా ఉద్దేశంతో షాన్ మసూద్, షార్జీల్, షోయబ్ మాలిక్‌లకు టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కాల్సింది. మిడిల్ ఆర్డర్‌లో వీరి అవసరం టీమ్‌కి చాలా ఉంటుంది... 

67
babar

బాబర్ ఆజమ్, ఆసియా కప్ 2022 టోర్నీలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అతను ఇప్పుడు చాలా పెద్ద ప్లేయర్. టీ20 వరల్డ్ కప్‌లో అతను పరుగులు చేయడం ఎంత అవసరమో, బాబర్‌కి బాగా తెలుసు. కాబట్టి అతను త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడు...

77

పాకిస్తాన్‌కి మిడిల్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉంది. ఆసియా కప్‌లో ఫెయిల్యూర్‌కి ఇదే కారణం. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్‌ జరుగుతోంది. అక్కడ పరువు పోకుండా ఉండాలంటే మిడిల్ ఆర్డర్‌లో సీనియర్లకు చోటు కల్పించడం అనివార్యం... సెలక్టర్లు ఈ విషయం గురించి ఆలోచించాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...  

click me!

Recommended Stories