నెం.4లో సంజూ శాంసన్ కంటే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్... వరల్డ్ కప్‌పై శిఖర్ ధావన్ కామెంట్స్..

Published : Aug 11, 2023, 05:36 PM IST

ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, అవకాశం దొరికినప్పుడల్లా టీ20 ఫార్మాట్‌లో రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. 49 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్సర్లు బాదిన సూర్య, 12 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచి.. టీ20 క్రికెట్‌లో లెజెండ్‌గా దూసుకుపోతున్నాడు..  

PREV
16
నెం.4లో సంజూ శాంసన్ కంటే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్... వరల్డ్ కప్‌పై శిఖర్ ధావన్ కామెంట్స్..

వన్ ఫార్మాట్ వండర్‌లా మారిన సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌లో మాత్రమే నిలదొక్కుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్..

26
Suryakumar Yadav

అయితే శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకుమార్ యాదవ్‌కి వరుస అవకాశాలు ఇస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే వాటిని వాడుకోవడంలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు.. అయితే టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం వన్డేల్లో నాలుగో స్థానానికి సూర్యనే బెస్ట్ ఆప్షన్ అంటున్నాడు..

36

‘తిలక్ వర్మతో పోలిస్తే నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించడమే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే అతను మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు, దేశవాళీ క్రికెట్‌లోనూ సుదీర్ఘ అనుభవం ఉంది..

46

సంజూ శాంసన్ కంటే సూర్యకుమార్ యాదవ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడే అవకాశాలు ఎక్కువని అనుకుంటున్నా. శుబ్‌మన్ గిల్ చాలా మంది ఫామ్‌లో ఉన్నాడు. అతనికి ఇండియాలో మంచి రికార్డు కూడా ఉంది. అందుకే గిల్, ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలని ఎదురుచూస్తున్నా...

56

వరల్డ్ కప్‌లో నేను ఎదురుచూస్తున్న మరో ప్లేయర్ రోహిత్ శర్మ. ఎందుకంటే 2019 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, ఐదు సెంచరీలు చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈసారి కూడా రోహిత్ బ్యాటు నుంచి అలాంటి ఇన్నింగ్స్‌లు రావచ్చు..

66

మన టీమ్‌లో అనుభవం ఉన్న ప్లేయర్లతో పాటు కుర్రాళ్లు కూడా ఉన్నారు. అదీకాకుండా మనకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. ఏ గ్రౌండ్ ఎలా ఉంటుందో, ఎలా స్పందింస్తుందో టీమిండియాకి బాగా తెలుసు.. అందుకే ఈసారి మనవాళ్లు టైటిల్ గెలుస్తారనే నమ్ముతున్నా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. 

click me!

Recommended Stories