రోల్ రివర్స్... ఇప్పుడు రోహిత్ శర్మపై విరాట్ కోహ్లీ ఎఫెక్ట్... ఐపీఎల్ టైటిల్ గెలిస్తే సరిపోదు...

First Published Sep 17, 2021, 11:03 AM IST

ఐసీసీ టైటిల్ గెలవలేదనే ఒక్క లోటు తప్ప, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కెరీర్‌ గ్రాఫ్... మిగిలిన కెప్టెన్లకు అందనంత ఎత్తులో ఉంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాహీ కంటే మెరుగైన విజయాలను కోహ్లీ కెప్టెన్సీలో అందుకుంది భారత జట్టు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 17 టీ20 సిరీస్‌లు జరగగా, అందులో 12 విజయాలను అందుకుంది భారత జట్టు. కేవలం 2 టీ20 సిరీస్‌లను కోల్పోయిన విరాట్ సేన, మూడు సిరీస్‌‌లను డ్రాగా ముగించింది...

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై టీ20 సిరీస్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు కూడా క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఐర్లాండ్, యూఎస్‌ఏ దేశాలలో టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కోహ్లీ...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 45 మ్యాచుల్లో 29 విజయాలను అందుకుని, 14 మ్యాచుల్లో ఓడింది భారత జట్టు. ఎమ్మెస్ ధోనీ (58.33) కంటే విరాట్ కోహ్లీ  (64.44) సక్సెస్ రేటు చాలా మెరుగ్గా ఉంది...

ఇప్పుడు రోహిత్ శర్మపై విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎఫెక్ట్ పడనుంది. ఎందుకంటే వరుసగా విరాట్ కెప్టెన్సీలో వరుసగా 9 టీ20 సిరీస్‌లను గెలిచింది భారత జట్టు...

టీమిండియా ఓడిన గత రెండు టీ20 సిరీస్‌లలో ఒకటి శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఓడిన లంక సిరీస్ కాగా, మరోటి రోహిత్ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌లో ఓడిన టీ20 సిరీస్...

ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ రోహిత్ శర్మ ఈ ప్రెషర్‌ను మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్‌సీబీ విజయాల్లో ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ మాత్రమే కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు... ఈ ఇద్దరూ ఫెయిల్ అయితే మ్యాచ్ పోయినట్టే...

ముంబై ఇండియన్స్ విషయంలో అలా కాదు, రోహిత్ శర్మ ఫెయిల్ అయినా డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ఇలా జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు...

అలాంటి జట్టును నడిపిస్తూ, టైటిల్స్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వాదన. అందుకే ఈసారి కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌గానూ నిరూపించుకోవాల్సిన బాధ్యత రోహిత్‌పైన ఉంది...

ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ వరుసగా హ్యాట్రిక్ టైటిల్స్ గెలిచినా రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అయితే, సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది...

ఇన్నాళ్లూ రోహిత్ ఫ్యాన్స్ నుంచి కోహ్లీ ట్రోలింగ్ ఎదుర్కోగా... ఈసారి సీన్ రివర్స్ అవుతుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను నడిపించినంత ఈజీ కాదు, టీమిండియాను నడిపించడం... అని కోహ్లీ ఫ్యాన్స్‌,రోహిత్‌పై విరుచుకుపడొచ్చు...

click me!