ధోనీకి ఈసారి కూడా కష్టమే, మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు... గౌతమ్ గంభీర్ కామెంట్స్...

First Published Sep 17, 2021, 10:40 AM IST

మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కి మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. అవకాశం దొరికినప్పుడల్లా మాహీపై అక్కసు వెల్లగక్కడానికి ఎదురుచూస్తూ ఉంటాడు గౌతీ. ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభ సమయంలో మరోసారి ఇలాంటి వాఖ్యలే చేశాడు గంభీర్...

‘ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన తర్వాత దేశవాళీ టోర్నీల్లో కూడా పాల్గొనడం లేదు. నేరుగా వచ్చి ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడాలని చూస్తున్నాడు...

ఈ ఫార్ములా ఐపీఎల్‌లో వర్కవుట్ కాదు. ఎందుకంటే ఇది సీపీఎల్ లేదా బంగ్లా ప్రీమియర్ లీగ్ కాదు... ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉంటారు...

సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు ఎలా సాధిస్తాడు... నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే ధోనీ... ఐపీఎల్‌లో కొన్నాళ్లుగా ఆరు, ఏడో స్థానంలో ఆడుతున్నాడు...

ఐపీఎల్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు కిందకు వెళ్తున్న మాహీ, బ్యాటింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు లేదు... అందుకే అతని నుంచి టీమ్ కూడా ఎక్కువగా ఆశించడం లేదు...

కేవలం వికెట్ కీపింగ్‌ కోసమే అయితే మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్లేయర్ ఆడాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గానూ గత రెండు సీజన్లలో మాహీ మ్యాజిక్ పనిచేయలేదు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

2020 ఐపీఎల్ ఆరంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైనట్టు ప్రకటించిన ఎమ్మెస్ ధోనీ, 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత నేరుగా ఐపీఎల్ బరిలో దిగాడు...

2020 ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఘోరంగా విఫలమైన ఎమ్మెస్ ధోనీ, బ్యాట్స్‌మెన్‌గా 200 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు..

2021 ఐపీఎల్ సీజన్‌లో మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, అంబటి రాయుడు, డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు రాణించడంతో మూడు మ్యాచుల్లో మాత్రమే బ్యాటింగ్‌కి వచ్చిన ఎమ్మెస్ ధోనీ 37 పరుగులు మాత్రమే చేశాడు...

click me!