ధోనీ ఐపీఎల్ రికార్డును లేపేసిన రోహిత్ శర్మ... అత్యధిక మొత్తం ఆర్జించిన క్రికెటర్‌గా హిట్ మ్యాన్...

Published : Dec 31, 2022, 01:41 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2022 ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నా... ఈ ఏడాది రోహిత్ శర్మ ఆడిన మ్యాచుల కంటే ఫిట్‌నెస్ సమస్యలు, రెస్ట్ పేరుతో పక్కకు తప్పుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ...

PREV
17
ధోనీ ఐపీఎల్ రికార్డును లేపేసిన రోహిత్ శర్మ... అత్యధిక మొత్తం ఆర్జించిన క్రికెటర్‌గా హిట్ మ్యాన్...
rohit dhoni

శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులోనూ రోహిత్ శర్మ పేరు కనిపించలేదు. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా, అతనికి టీ20 టీమ్‌లో చోటు దక్కకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. రోహిత్ ఇకపై టీ20 ఫార్మాట్‌ ఆడకపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి...

27

టీమిండియా విషయంలోనే కాదు, ఐపీఎల్‌లోనూ ఈ ఏడాది రోహిత్‌కి కలిసి రాలేదు. వరుసగా 8 మ్యాచుల్లో ఓడి చెత్త రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్, 14 మ్యాచుల్లో 10 పరాజయాలు చవిచూసి... లీగ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఆఖరి పొజిషన్‌లో నిలిచింది..

37

అయితే ఐపీఎల్ 2023 సీజన్‌ని పాజిటివ్ నోట్‌తో మొదలెట్టబోతున్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఏడాదికి రూ.16 కోట్లు అందుకుంటున్నాడు రోహిత్ శర్మ. వచ్చే ఏడాది రోహిత్ అందుకునే రూ.16 కోట్లతో కలిపి అతని ఐపీఎల్ సంపాదన రూ.178.6 కోట్లకు చేరుతుంది...

47

ఇన్నాళ్లు ఐపీఎల్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జించిన ప్లేయర్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును చెరిపేయబోతున్నాడు రోహిత్ శర్మ. గత సీజన్‌లో రెండో రిటెన్షన్ దక్కించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ రూ.12 కోట్లు మాత్రమే తీసుకున్నాడు...

57

రవీంద్ర జడేజాకి రూ.16 కోట్లతో మొదటి రిటెన్షన్ ఇవ్వడంతో ధోనీకి రెండో రిటెన్షన్‌ దక్కింది. వచ్చే ఏడాది కూడా రూ.12 కోట్లు తీసుకోబోతున్నాడు ధోనీ. దీంతో రోహిత్, ఈ రెండు సీజన్లలో కలిపి ధోనీ కంటే రూ.8 కోట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు. వచ్చే సీజన్‌లో సంపాదనతో కలిపి మాహీ ఐపీఎల్ ఆర్జన రూ.176.84కి చేరుతుంది...

67

మొదటి మూడు సీజన్లలో రూ.12 లక్షలకే ఐపీఎల్ ఆడిన విరాట్ కోహ్లీ, వచ్చే సీజన్‌లో రూ.16 కోట్లు అందుకోబోతున్నాడు. ఈ మొత్తంతో కలిపి విరాట్, ఐపీఎల్ ఆదాయం రూ.173.2 కోట్లకు చేరుతుంది... రోహిత్ టాప్‌లో ఉంటే, ధోనీ రెండో స్థానంలో, కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు...

77
RCB vs MI

2024 సీజన్‌లో ఈ లెక్కలన్నీ మారిపోయే అవకాశం ఉంది. రెండో స్థానంలో ఉన్న ధోనీని విరాట్ కోహ్లీ దాటేస్తాడు. మాహీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా, తీసుకోకపోయినా టాప్ 2లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీయే ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories