కేంద్రమంత్రిని కలిసిన పాండ్యా బ్రదర్స్... అమిత్ షా అండతోనే హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ వచ్చిందంటూ...

Published : Dec 31, 2022, 01:19 PM ISTUpdated : Dec 31, 2022, 01:24 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముందు వరకూ హార్ధిక్ పాండ్యాలో కెప్టెన్సీ ఉన్నాడనే విషయాన్ని కూడా ఎవ్వరూ గుర్తించలేదు. పేలవ ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యి టీమ్‌కి దూరమయ్యాడు హార్ధిక్ పాండ్యా. అయితే నాలుగు నెలల్లో సీన్ మారిపోయింది...

PREV
17
కేంద్రమంత్రిని కలిసిన పాండ్యా బ్రదర్స్... అమిత్ షా అండతోనే హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ వచ్చిందంటూ...

టీమిండియా కెప్టెన్సీ రేసులో నిలిచిన శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లను పక్కకు నెడుతూ దూసుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా. రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యా, టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి...

27
Image Credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్ధిక్ పాండ్యాని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఎంచుకోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా ఐపీఎల్ 2022 సీజన్‌ని మొదలెట్టిన గుజరాత్ టైటాన్స్, టైటిల్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర క్రియేట్ చేసింది...

37

ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడనే ఉద్దేశంతో రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. 2022 సీజన్‌లో కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఇప్పుడు పగ్గాలు హార్ధిక్ పాండ్యా చేతికి వచ్చాయి...

47

తాజాగా పాండ్యా బ్రదర్స్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిసి మాట్లాడారు. అమిత్ షా స్వయంగా పిలిచి తన నివాసంలో పాండ్యా బ్రదర్స్‌తో ముచ్చటించాడు. ‘మమ్మల్ని ఆహ్వానించి, మాతో విలువైన సమయం గడిపినందుకు థ్యాంక్యూ... హోం మినిస్టర్ శ్రీ అమిత్ షా జీ. మిమ్మల్ని కలవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం...’ అంటూ రాసుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా...
 

57
Yash and pandya brothers

రోహిత్ శర్మ ఫెయిల్ కావడంతో టీ20 ఫార్మాట్‌‌కి హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అదీ కాకుండా పాండ్యా, గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు కావడంతో అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి...

67
Image credit: PTI

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ, కొద్దిరోజులకే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని కూడా సైడ్ చేసింది. ఇప్పుడు రోహిత్ శర్మను టార్గెట్ చేశారని, అతను కూడా త్వరలో రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి...

77

బీసీసీఐ సెక్రటరీ జై షా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండతో త్వరలో హార్ధిక్ పాండ్యాకి వైట్ బాల్ కెప్టెన్సీ దక్కడం ఖాయమని, పాండ్యాని పిలిచి ఇదే విషయం గురించి మాట్లాడి ఉండవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. 

click me!

Recommended Stories