పృథ్వీ షాని తీసుకురండి! సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలను ఆడించండి... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Dec 31, 2022, 12:50 PM IST

గత రెండు ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రదర్శన క్రికెట్ ఫ్యాన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచిన భారత జట్టు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన 2022 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరినా... ఇంగ్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది...

ఆసియా కప్ 2022 టోర్నీలోనూ చిత్తుగా ఓడిన భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచినా... సెమీ ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ టోర్నీలో అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన ఇచ్చాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను టీ20 ఫార్మాట్‌కి దూరంగా పెట్టాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి...

‘సీనియర్లను టీ20 ఫార్మాట్ నుంచి పక్కన బెట్టాలని అనుకుంటే ఆ విషయాన్ని ముందుగానే వాళ్లకు చెప్పండి. క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మనకంటే ముందే వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టీమ్స్ కూడా సీనియర్లను టీ20 ఫార్మాట్‌కి దూరంగా పెట్టాయి...

ఓ ప్లేయర్‌ని తప్పించాడని సెలక్టర్లపైన, మేనేజ్‌మెంట్‌పైన పడి ఏడుస్తున్నాం. ఏ ఒక్క ప్లేయర్ వల్ల టీమ్ తలరాత మారిపోతుందా? జట్టు అంతా కలిసి ఆడాలి. వచ్చే టీ20 వరల్డ్ కప్‌కి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలి...

సూర్యకుమార్ యాదవ్‌లాంటి ప్లేయర్లు ఉంటే వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా టీమ్‌లో ఉండాలి. పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్‌లకు వరుస అవకాశాలు ఇవ్వాలి. పృథ్వీ షాలాంటి ప్లేయర్‌ని ఎందుకు పక్కనబెట్టేశారో నాకైతే అర్థం కావడం లేదు...

Image credit: PTI

దూకుడుగా ఆడే ప్లేయర్లే, టీ20 ఫార్మాట్‌కి అవసరం. వాళ్లే జట్టుకి విజయాలను అందించగలరు. టీ20 ఫార్మాట్‌కి తగ్గ ఆటగాళ్లను గుర్తించి, వాళ్లను ప్రోత్సాహించాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

click me!