INDvsENG: ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ... 200 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా...

First Published Feb 13, 2021, 1:25 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ నమోదుచేశాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో వన్డేల్లో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ, 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 78 బంతుల్లోనే 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 80 పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ, సెంచరీ మార్కు అందుకునేందుకు 130 బంతులను ఎదుర్కొన్నాడు. 

సెంచరీకి కావాల్సిన చివరి మూడు పరుగులు పూర్తి చేసుకునేందుకు 13 బంతులు ఎదుర్కొన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. 130 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఓపెనర్‌గా రోహిత్ శర్మకి ఇది 35వ అంతర్జాతీయ సెంచరీ.
undefined
అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు క్రిస్‌గేల్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.
undefined
రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, స్వదేశంలో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ.
undefined
టీమిండియా తరుపున 200 సిక్సర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ బాదిన 186 సిక్సర్లే టీమిండియా తరుపున అత్యధికం. యువరాజ్ సింగ్ 113, వీరేంద్ర సెహ్వాగ్ 111, విరాట్ కోహ్లీ 110, సచిన్ టెండూల్కర్ 107 సిక్సర్లు బాదారు...
undefined
స్వదేశంలో 200 సిక్సర్లు పూర్తి చేసుకునేందుకు మార్టిన్ గుప్టిల్ 161 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే, రోహిత్ శర్మ 123 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. మెక్‌కల్లమ్ 192 ఇన్నింగ్స్‌లు, క్రిస్ గేల్ 217 ఇన్నింగ్స్‌లతో టాప్ 4లో ఉన్నారు.
undefined
టీమిండియా తరుపున మొట్టమొదట 50 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా కపిల్ దేవ్ రికార్డు క్రియేట్ చేస్తే, సచిన్ టెండూల్కర్ 100 సిక్సర్ల క్లబ్‌ను క్రియేట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ 150 సిక్సర్లు పూర్తి చేసుకుంటే, స్వదేశంలో 200 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ.
undefined
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత వైస్ కెప్టెన్ అజింకా రహానే 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి ఆసియా క్రికెటర్‌గా నిలిచాడు అజింకా రహానే... టీమిండియా తరుపున రోహిత్ శర్మ 800+ పరుగులతో నాలుగో స్థానంలో, ఛతేశ్వర్ పూజారా 794, విరాట్ కోహ్లీ 788 పరుగులతో ఉన్నారు.
undefined
ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, అజింకా రహానేతో కలిసి నాలుగో వికెట్‌కి 50+ భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు.ఆస్ట్రేలియా టూర్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మకు ఈ సీజన్‌లో ఇదే తొలి సెంచరీ. టెస్టుల్లో ఏడో సెంచరీ...
undefined
click me!