వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వర్షం పడి మ్యాచ్ ఆగిపోతుంది అనుకున్నారు. కానీ, ఎన్ని సార్లు అవంతరాలు కలిగించినా టీమిండియా విజయానికి అత్యంత చేరువగా వచ్చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది.