Image credit: PTI
టీమిండియా తరుపున 21 టెస్టులు, 121 వన్డేలు, 77 టీ20 మ్యాచులు ఆడిన భువనేశ్వర్ కుమార్, జనవరి 2022లో ఆఖరి వన్డే ఆడాడు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు..
Image credit: Getty
టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలతో మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భువనేశ్వర్ కుమార్, 2018 తర్వాత టెస్టు మ్యాచులు ఆడింది కూడా లేదు. జూన్ 2022లో ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన భువీ... 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయపడ్డాడు..
Image credit: PTI
గాయంతో బాధపడుతూ టీమ్‌కి దూరమైన భువనేశ్వర్ కుమార్, రీఎంట్రీ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో భువనేశ్వర్ కుమార్‌కి చోటు దక్కలేదు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన టీమ్‌లోనూ భువీ పేరు కనిపించలేదు..
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో 7 మ్యాచులు ఆడి 5 వికెట్లు మాత్రమే తీసిన భువనేశ్వర్ కుమార్, 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 12 వికెట్లు మాత్రమే తీశాడు. 2021 సీజన్‌లోనూ భువీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 11 మ్యాచుల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు..
జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కలిసి టీమిండియాకి ఓపెనింగ్, డెత్ బౌలర్లుగా ఎన్నో మ్యాచులు గెలిపించారు. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీయడం భువీ స్పెషాలిటీ. డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా కట్టడం చేయడంలో భువీ ఎక్స్‌పర్ట్..
Image credit: PTI
టీ20ల్లో అత్యంత కీలకమైన 19వ ఓవర్ వేసి, 9-10 పరుగులను కూడా కట్టడి చేసి ఎన్నో మ్యాచులు గెలిపించాడు భువీ. అయితే రీఎంట్రీ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మునుపటి వాడీ, వేడీ కనిపించడం లేదు. వికెట్లు తీయడంలో ఫెయిల్ అవుతున్న భువీ, ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయడంలోనూ విఫలం అవుతున్నాడు..
Image credit: Getty
ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి త్వరలో జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఆసియా కప్, ఆసియా క్రీడలు వంటి మెగా టోర్నీలు ఉండడంతో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు ఆడడం అనుమానమే..
దీంతో టీమిండియా సెలక్టర్లు భువనేశ్వర్ కుమార్‌వైపు చూస్తారా? లేక అతన్ని పూర్తిగా పక్కనబెట్టేస్తారా? అనేది అతని కెరీర్‌ని డిసైడ్ చేయనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో మోహిత్ శర్మ అదిరిపోయే పర్ఫామెన్స్ చూపించాడు. అయితే అతన్ని తిరిగి టీమ్‌కి ఎంపిక చేయడానికి సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు..
ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లో మోహిత్ శర్మకు చోటు దక్కకపోతే, ఇక వచ్చే ఐపీఎల్ 2024 సీజన్ వరకూ అతన్ని పరిగణనలోకి తీసుకోదు టీమిండియా. దీంతో భువీకి, మోహిత్ శర్మకు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ కెరీర్ డిసైడర్ సిరీస్‌గా మారబోతోందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..