ధోనీ ఏం చెప్పినా దీపక్ చాహార్ వినడు! తిట్టించుకునేదాకా తెచ్చుకుంటాడు.. - అంబటి రాయుడు

First Published Jul 23, 2023, 11:25 PM IST

విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ ఇలాగే మహేంద్ర సింగ్ ధోనీతో ప్రత్యేకమైన అనుబంధం పెంచుకున్న ప్లేయర్ దీపక్ చాహార్. ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహార్‌ని రూ.14 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్..
 

మహేంద్ర సింగ్ ధోనీని రూ.12 కోట్లకు రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌‌, దీపక్ చాహార్ కోసం రూ.2 కోట్లు ఎక్కవే చెల్లించడానికి సిద్ధమైంది. సీఎస్‌కే, దీపక్ చాహార్ కోసం ఎంతైనా పెట్టడానికి సిద్ధమవ్వడానికి కారణం కూడా మాహీయే...

‘దీపక్ చాహార్‌తో వచ్చిన సమస్య ఏంటంటే అతను అన్నీ తనకి తెలుసుని అనుకుంటాడు. కాబట్టి ధోనీ భాయ్ ఏం చెప్పడానికి వచ్చినా దానికి ఏదో ఒక వంక చెబుతాడు. అలా కాదు, ఇలా ఎందుకు చేయకూడదు. ఇలా చేస్తే ఏమవుతుంది.. అని కొత్త కొత్త థియరీలు చెబుతాడు..
 

Latest Videos


Deepak Chahar

ఆఖరికి మాహీ భాయ్‌తో తిట్టించుకుని, ఆయన చెప్పిందే చెస్తాడు. దీపక్ చాహార్‌ బ్రిలియెంట్ క్రికెటర్. అంతకుమించి మంచి మనిషి కూడా. ధోనీ, దీపక్ చాహార్ మధ్య అన్న, తమ్ముళ్ల వంటి బంధం ఉంది. అందుకే వాళ్లిద్దరూ ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చాలా సరదాగా ఉంటారు..’ అంటూ కామెంట్ చేశాడు అంబటి రాయుడు..

2023 సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత అంబటి రాయుడి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ‘అంబటి రాయుడి లాంటి ప్లేయర్, టీమ్‌లో ఉంటే ఫేర్‌ఫ్లే అవార్డు ఎప్పటికీ రాదు..’  అంటూ ధోనీ చేసిన వ్యాఖ్యలపై అంబటి రియాక్ట్ అయ్యాడు..
 

‘నేను, షేన్ వాట్సన్ ఇద్దరం కూడా అంపైర్లు ఇచ్చే నిర్ణయాలపై ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం. బౌన్సర్లు వేసినా, వైడ్ బాల్ ఇవ్వకపోయినా అంపైర్‌తో గొడవ పెట్టుకోకుండా ఉండలేం. చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి..

Ambati Rayudu

నా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుని, కోపం తగ్గించుకోవాలని చాలా సార్లు ప్రయత్నించా. అయితే గేమ్‌లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా లీనం అయిపోతాం, ఆ హీట్‌లో కోపం వచ్చేస్తుంది. అందుకే కొన్ని పాయింట్లు పోయాయి. అందుకే నేను టీమ్‌లో ఉంటే ఫేయిర్ ప్లే అవార్డు రాదని మాహీ భాయ్ చెప్పాడు..

టీమ్‌లో నన్ను బాగా విసిగించే పర్సన్ డీజే బ్రావో. ప్లేయర్లకు కోపం తెప్పిస్తే, వాళ్లకు కోపం వచ్చేలా మాట్లాడితే బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారని బ్రావో అనుకుంటాడు. కానీ కొన్నిసార్లు బ్రావో మాట్లాడే మాటలు తట్టుకోలేక నోరు మూసుకోమని అరిచేస్తా.. మేం చాలా మంచి స్నేహితులం..

dhoni

మాహీ భాయ్‌ కూడా మనిషే. ఆయనకి కూడా కోపం వస్తుంది. సాధ్యమైనంత వరకూ ధోనీ భాయ్ కూల్‌గా కామ్‌గా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మ్యాచ్‌‌ ఉన్న పరిస్థితుల్లో కొన్ని కంట్రోల్ చేయలేం.. అందుకే అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు...

dhoni

2019లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ భాయ్ గ్రౌండ్‌లోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడతాడని మేం కూడా అనుకోలేదు. అయితే అంపైర్లతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకోవడంలో తప్పేం లేదు కదా.. కెప్టెన్‌గా మాత్రమే ఆయన ఫీల్డ్‌లోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడారు..’ అంటూ చెప్పుకొచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు.. 

click me!