ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ ముగ్గురూ ఫెయిల్... కౌంటీ టీమ్‌లో ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్...

First Published Jul 20, 2021, 5:16 PM IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టుకి ఆరంభంలోనే షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ, అజింకా రహానే గైర్హజరీతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ, స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు...

మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కౌంటీ ఎలెవన్ టీమ్‌లో ఇద్దరు భారత ప్లేయర్లకు చోటు కల్పించింది. భారత యంగ్ పేసర్, స్టాండ్ బై ప్లేయర్ ఆవేశ్ ఖాన్... ఇంగ్లాండ్ కౌంటీ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.
undefined
వాషింగ్టన్ సుందర్‌ని కూడా కౌంటీ ఎలెవన్ తరుపున ఆడించాలని భారత జట్టు ప్రయత్నించినా, అతను రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...
undefined
టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి 10వ ఓవర్‌లోనే షాక్ తగిలింది. 33 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన రోహిత్ శర్మ, లీడన్ జేమ్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
ఆ తర్వాత 35 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా లీడన్‌ జేమ్స్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యడు... 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
undefined
భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ఛతేశ్వర్ పూజారా 47 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి స్టంపౌట్ కాగా,67 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు...
undefined
కౌంటీ ఎలెవన్ తరుపున భారత జట్టు బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేసిన ఆవేశ్ ఖాన్, తన తొలి స్పెల్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 మెయిడిన్లతో 28 పరుగులు ఇచ్చాడు...
undefined
రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా కరోనా ప్రోటోకాల్ కారణంగా ఈ మ్యాచ్‌కి దూరం కాగా భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఆడడం లేదు...
undefined
click me!