భువనేశ్వర్ కుమార్ రేర్ ఫీట్... ఆరేళ్ల తర్వాత మొట్టమొదటి నో బాల్...

First Published Jul 20, 2021, 3:51 PM IST

ఫాస్ట్ బౌలర్లు నో బాల్స్ వేయడం చాలా కామన్. భారతస్టార్ బౌలర్‌గా గుర్తింపు పొందుతున్న జస్ప్రిత్ బుమ్రాకి అయితే నో బాల్స్ వేయడం అలవాటు. అయితే భారత ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఈ విషయంలో చాలా రేర్ రికార్డు క్రియేట్ చేశాడు...

2012లో భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసిన భువనేశ్వర్ కుమార్, చివరిసారిగా 2015 అక్టోబర్‌లో వన్డేల్లో నో బాల్ వేశాడు...
undefined
ఆ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌లో 3093 బంతులు విసిరిన భువనేశ్వర్ కుమార్, ఆరేళ్లుగా నో బాల్స్ లేకుండా బౌలింగ్ చేయడం విశేషం...
undefined
తొలి వన్డేలో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 63 పరుగులిచ్చి, వికెట్ తీయలేకపోయిన భువనేశ్వర్ కుమార్, రెండో వన్డేలో మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసినంత పని చేశాడు.
undefined
భువీ బౌలింగ్‌లో శ్రీలంక ఓపెనర్ ఆవిష్క ఇచ్చిన క్యాచ్‌,మనీశ్ పాండే చేతి అంచులను తాకతూ వెళ్లింది... ఆ తర్వాతి ఓవర్‌లో దీపక్ చాహార్ బౌలింగ్‌లోనూ కూడా ఓ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు పాండే...
undefined
తొలి వన్డేలో మొదటి వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించిన ఆవిష్క, మనోద్ జోడీ, రెండో వన్డేలో 60+ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం...
undefined
మొదటి వన్డేలోలా కాకుండా ఏడో ఓవర్ నుంచి బౌలింగ్‌లో మార్పులు చేశాడు శిఖర్ ధావన్. అయితే ఆ మార్పులను చక్కగా వాడుకుని బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నారు శ్రీలంక ఓపెనర్లు..
undefined
click me!