అదంతా చెత్త వాగుడు! వన్డేలకు వచ్చిన ముప్పేం లేదు... రోహిత్ శర్మ కామెంట్...

First Published Aug 18, 2022, 1:36 PM IST

టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డేలకు క్రేజ్ తగ్గిపోయింది. గత రెండేళ్లుగా భారత జట్టు ఆడిన వన్డేల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. టీమిండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత బెన్ స్టోక్స్, 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో వన్డేల మనుగడపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది...

Image credit: Getty

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా, షాహిదీ ఆఫ్రిదీ, వసీం అక్రమ్ వంటి పాక్ మాజీ క్రికెటర్లు కూడా వన్డేల మనుగడపై అనుమానాలు వ్యక్తం చేశారు... ఈ ఫార్మాట్‌ త్వరలోనే చరిత్రలో కలిసి పోతుందని వాపోయారు...

rohit sharma

వన్డేలను కాపాడాలంటే 50 ఓవర్లకు బదులుగా 40-40 ఓవర్లకు ఇన్నింగ్స్‌ని కుదిస్తే బెటర్ అంటూ షాహిద్ ఆఫ్రిదీ, రవి శాస్త్రి సలహాలు ఇచ్చారు. వన్డే ఫార్మాట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఐసీసీపైనే ఉందంటూ కామెంట్లు చేశారు...

ROHIT

‘నాకు ఎక్కువ పేరు వచ్చింది వన్డే ఫార్మాట్ వల్లే. వన్డే ఫార్మాట్‌ చరిత్రలో కలిసిపోతుందంటే నేను నమ్మను. అదంతా చెత్త వాగుడే. ఇంతకుముందు టెస్టుల గురించి ఇలాగే మాట్లాడారు. టెస్టులు ఎవ్వరూ చూడరని అన్నారు...

Image credit: Getty

నా వరకూ క్రికెట్ ముఖ్యం, అది టెస్టు ఫార్మాట్ ఆ... వన్డే ఫార్మాట్ ఆ.. లేక టీ20 ఫార్మాట్ ఆ... అనేది పట్టించుకోను. ఏ ఫార్మాట్ ఆడాలనేది ఆడేవారి ఇష్టం. నాకైతే మూడు ఫార్మాట్లు ముఖ్యమైనవే...

Image credit: Getty

వచ్చే ఏడాది దుబాయ్‌లో పాకిస్తాన్‌తో ఆడాం. అప్పుడు మేం అనుకున్న రిజల్ట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. మేం ఈ మ్యాచ్ కోసం సిద్ధమయ్యే విధానం కూడా మారింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

click me!