అందరూ ఉన్నా, ఒంటరిగా ఫీల్ అయ్యా... మెంటల్ హెల్త్‌పై విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్...

First Published Aug 18, 2022, 12:40 PM IST

సచిన్ టెండూల్కర్ తర్వాత టీమిండియా తరుపున ఆ రేంజ్‌లో పరుగులు ప్రవాహం సృష్టించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. 70 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గానూ సంచలన విజయాలు అందుకున్నాడు. అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా, ఆల్‌టైం గ్రేట్ టెస్టు సారథుల్లో ఒకటిగా నిలిచిన విరాట్ కోహ్లీ... మెంటల్ హెల్త్ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు...

14 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేశాడు. ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు విరాట్ కోహ్లీ...

Virat Kohli

‘అథ్లెట్‌కి హెల్తీ ఫుడ్ చాలా అవసరం. ఫుడ్‌ సరిగా లేకపోయినా, ప్రెషర్‌కి ఫీలైనా అది మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపిస్తుంది. మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడమే సరైన పని...

వర్కవుట్స్ చేయడం వల్ల మెంటల్‌ హెల్త్‌ బాగుపడి శ్రద్ధ, ఏకాగ్రాత పెరుగుతాయి. నేను కూడా ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేశా.  ఓసారి చుట్టూ నా వాళ్లు, నన్ను ప్రేమించే వాళ్లు ఉన్నా ఒంటరిగా ఫీలయ్యా. ఇలాంటి పరిస్థితి మనలో చాలా మంది ఫేస్ చేసి ఉంటారు...

మన మూడ్ సరిగ్గా లేకపోయినా అందరిలో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్‌ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న రిలేషన్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ మెంటల్ హెల్త్ మీద చేసిన వ్యాఖ్యలు మరోసారి బీసీసీఐపై ట్రోలింగ్ రావడానికి కారణమయ్యాయి. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వన్డేల్లో అత్యధిక విజయాలు శాతం ఉన్న టీమిండియా కెప్టెన్‌‌ని ఇలా తప్పించడం, ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది...

Virat Kohli

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన విభేదాలే అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణమంటూ వార్తలు వినిపించాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు...

Image credit: Getty

ఈ వరుస సంఘటనలతో  కోహ్లీ ఇలా డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలై ఉంటాడని, దీనికి కారణం బీసీసీఐ రాజకీయాలే నంటూ విమర్శలు చేస్తున్నారు విరాట్ అభిమానులు...

click me!