Rohit Sharma: కెప్టెన్సీ వేరేవాళ్లకిచ్చి అతడిని తొలగించడమే ఉత్తమం : సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

Published : Jun 27, 2022, 07:09 PM IST

Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్  శర్మపై  డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన  కామెంట్స్ చేశాడు. వరుసగా సిరీస్ లకు దూరమవుతున్న  అతడిని  కెస్టెన్సీ నుంచి తొలగించడమే ఉత్తమమని అంటున్నాడు. 

PREV
19
Rohit Sharma: కెప్టెన్సీ వేరేవాళ్లకిచ్చి అతడిని తొలగించడమే ఉత్తమం : సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

విరాట్ కోహ్లి తర్వాత భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో సారథిగా వ్యవహరిస్తున్నాడు రోహిాత్ శర్మ.  గతేడాది సెప్టెంబర్ నుంచి టీమిండియా నాయకత్వ పగ్గాలు చేపట్టిన అతడు ఇప్పటివరకు  పూర్తిస్థాయి కెప్టెన్ గా ఒక్క సిరీస్ (స్వదేశంలో శ్రీలంక సిరీస్ మినహా) కూడా ఆడలేదు. 

29

ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు తో అతడు వెళ్లలేదు. చేతి వేలి గాయం కారణంగా అతడు ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ కు కూడా హిట్ మ్యాన్ అందుబాటులో లేడు. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో గతేడాది మిగిలిపోయిన ఐదో టెస్టు ఆడటానికి వెళ్లిన  అతడు.. అక్కడ కూడా కరోనా బారిన పడ్డాడు. 

39

సఫారీ సిరీస్ లో రోహిత్ ప్లేస్ ను రిషభ్ పంత్ తో పూరించారు సెలక్టర్లు. ఇక ఇంగ్లాండ్ తో ఎవరు టెస్టు కెప్టెన్ గా ఉంటారో తేలాల్సి ఉంది. రోహిత్ కు కరోనా.. సిరీస్ లకు విరామం నేపథ్యంలో అతడికి టీ20 బాధ్యతల నుంచి తప్పించిందే ఉత్తమమంటున్నాడు మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. అప్పుడైనా హిట్ మ్యాన్ పై ఒత్తిడి, పనిభారం  తగ్గి వన్డేలు, టెస్టుల మీద పూర్తిస్థాయి ఫోకస్ పెడతాడని అంటున్నాడు. 

49

తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరూ  మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్ లో రోహిత్ లేని పక్షంలో ఎవరినైతే కెప్టెన్ చేయాలని  సెలక్టర్లు, బీసీసీఐ భావిస్తున్నదో వారికి ఇప్పుడే ఆ బాధ్యతలు అప్పగించాలి. ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ ను తప్పించాలి. 

59

తద్వారా అతడు పనిభారం తగ్గి  టెస్టులు, వన్డేల మీద పూర్తిస్థాయి దృష్టి సారిస్తాడు.  పనిభారంతో పాటు మానసికంగా కూడా హిట్ మ్యాన్ ప్రశాంతంగా ఉంటాడు. దీంతో అతడు నూతనుత్సాహంతో మిగిలిన రెండు ఫార్మాట్లలో రాణిస్తాడు. 

69

అదీగాక రోహిత్ వయసును కూడా దృష్టిలో ఉంచుకుని  రోహిత్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించడమే ఉత్తమం..’అని  వీరూ చెప్పాడు. అయితే ప్రస్తుతం టీమిండియాలో ఫార్మాట్ కు ఒకరు అన్నట్టుగా కెప్టెన్ లేరు.

79

ఒకే కెప్టెన్ మూడు ఫార్మాట్లకు సారథిగా ఉన్నాడు. మరి బీసీసీఐ ఈ ప్రతిపాదనకు అంగీకరించదు కదా అన్న ప్రశ్నకు కూడా వీరూ  సమాధానమిచ్చాడు. ‘అలాంటప్పుడు  భారత జట్టును నడిపించడంలో రోహిత్ కే నా ఓటు’ అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.   

89

రానున్న నాలుగు నెలల్లో భారత జట్టు ఆసియా కప్ తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా ఆడాల్సి ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో టైటిల్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగిన భారత జట్టు గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే నిష్క్రమించింది. ఈసారిమాత్రం  కచ్చితంగా టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నది. 

99

ముంబై ఇండియన్స్ కు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ సారథ్యం భారత జట్టుకు ఉపకరిస్తుందని బీసీసీఐ ఉపకరిస్తుందని ఆశిస్తున్న తరుణంలో సెహ్వాగ్ పై విదంగా స్పందించడం చర్చనీయాంశమైంది. 

Read more Photos on
click me!

Recommended Stories