క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డుకి చేరువలో రోహిత్ శర్మ... సూపర్ హాఫ్ సెంచరీ తర్వాత...

First Published | Sep 27, 2023, 8:11 PM IST

రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా, రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ 18 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ రోహిత్ శర్మ 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

Rohit Sharma

మొదటి ఓవర్ నుంచే రోహిత్ శర్మ దూకుడుగా ఆడడంతో మొదటి పవర్ ప్లేలో 72 పరుగులు రాబట్టింది భారత జట్టు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, 13 ఏళ్ల తర్వాత పవర్ ప్లేలో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు..

ఇంతకుముందు 2010లో గౌతమ్ గంభీర్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో 7 సార్లు ఈ ఫీట్ సాధించగా సచిన్, రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ ఒక్కోసారి పవర్ ప్లేలోనే 50+ స్కోర్లు చేశారు..
 

Latest Videos


Rohit Sharma

నేటి ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ క్రికెట్‌లో 551 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ మాత్రమే 550+ సిక్సర్లు బాదాడు.  క్రిస్ గేల్ 553 అంతర్జాతీయ సిక్సర్లతో టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ మరో 3 సిక్సర్లు బాదితే అతన్ని అధిగమిస్తాడు..

550 సిక్సర్లు కొట్టడానికి క్రిస్ గేల్‌కి 544 ఇన్నింగ్స్‌లు అవసరమైతే, రోహిత్ శర్మ 471 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో 5+ సిక్సర్లు బాదడం రోహిత్‌కి ఇది 17వ సారి. సచిన్ టెండూల్కర్ 8 సార్లు, గంగూలీ 7, సెహ్వాగ్ 6, ధోనీ  5 సార్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారు..
 

రోహిత్ శర్మ స్వదేశంలో 260 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. ఇంతకుముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 256, మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 230 సిక్సర్లు బాదారు...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో 7200 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. టీమిండియా తరుపున నాలుగో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడిగా నిలిచారు రోహిత్- విరాట్..

సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ కలిసి 12400 పరుగులు జోడిస్తే, సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రావిడ్ 11037 పరుగులు, రాహుల్ ద్రావిడ్ - సౌరవ్ గంగూలీ 7626 పరుగులతో విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ కంటే ముందున్నారు.. 

click me!