పంత్! నువ్వేం చేశావో నీకైనా తెలుసా! ... రిషబ్ పంత్‌తో రోహిత్ శర్మ! ఆ ఇన్నింగ్స్‌ తర్వాత...

First Published Sep 27, 2022, 1:14 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు నుంచే రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇస్తూ వచ్చింది టీమిండియా. అయితే వాటిని సరిగ్గా వాడుకోలేకపోయాడు రిషబ్ పంత్. మూడు ఫార్మాట్లలో జట్టు కోల్పోయి, అనుకోకుండా కమ్‌బ్యాక్ ఇచ్చి సూపర్ స్టార్‌గా మారిపోయాడు...

Rishabh Pant Brisbane Test

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉండడంతో రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇచ్చింది. అయితే పంత్‌ని ధోనీతో పోల్చి చూస్తూ అభిమానులు ఎగతాళి చేయడం వంటి సంఘటనలు అతన్ని తీవ్రంగా కలిచి వేశాయి... 

దీంతో మూడు ఫార్మాట్లలోనూ ఫెయిల్ అవుతూ వచ్చిన రిషబ్ పంత్, 2020 ఐపీఎల్‌కి ముందు జట్టులో చోటు కోల్పోయాడు. వన్డే, టీ20ల్లో కెఎల్ రాహుల్‌ని... టెస్టుల్లో వృద్ధిమాన్ సాహాని వికెట్ కీపర్లుగా వాడుతూ వచ్చింది భారత జట్టు. అయితే ఆడిలైడ్ పరాభవంతో సాహా ప్లేస్‌లో రిషబ్ పంత్‌కి చోటు దక్కింది...

మెల్‌బోర్న్ టెస్టులో 30+ పరుగులు చేసి మెప్పించిన రిషబ్ పంత్, సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో 97 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత గబ్బాలో పంత్ ఆడిన మ్యాచ్ విన్నింగ్స్ అతని కెరీర్‌నే మలుపు తిప్పింది...

విరాట్ కోహ్లీ లీవ్‌లో ఉండడం, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, హనుమ విహారి, కెఎల్ రాహుల్... ఇలా కీ ప్లేయర్లు అందరూ గాయాలతో దూరం కావడంతో గబ్బా టెస్టులో భారత జట్టు ఓడిపోవడం ఖాయమనుకున్నారంతా. అందులోనూ గబ్బాలో 32 ఏళ్లుగా ఒక్క టెస్టు కూడా ఓడిపోని రికార్డు ఆస్ట్రేలియాది...

అయితే రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, శుబ్‌మన్ గిల్, టి నటరాజన్ వంటి కుర్రాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ ఇచ్చిన భారత జట్టు, 32 ఏళ్లుగా ఏలుతున్న గబ్బా కోటను కూల్చేసింది. 

‘గబ్బా టెస్టు ముగిసిన తర్వాత మేమంతా డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమయ్యాం. రోహిత్ శర్మ వచ్చి, రిషబ్ పంత్‌తో ‘నువ్వేం చేశావో నీకు తెలీదు... ’ అన్నాడు. రిషబ్ పంత్ ఆ మాటలకు మౌనంగా నవ్వుతూ ఉండిపోయాడు. రిషబ్ పంత్ తన ఇన్నింగ్స్‌తో రెడ్ బాల్ క్రికెట్‌లో తానేం చేయగలడో చెప్పాడు...

వైట్ బాల్ క్రికెట్‌లో రిషబ్ పంత్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు చాలా వస్తాయి. రిషబ్ పంత్ నుంచి కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు చూడబోతున్నాం. మళ్లీ పంత్ పవర్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి...

Rishabh Pant-Rohit Sharma

ప్రతీ ఒక్కరూ అన్ని రకాల స్కిల్స్‌ని అమ్మ కడుపులోనే నేర్చుకోరు. కొన్ని స్కిల్స్‌ అనుభవంతో వస్తాయి, మరికొన్ని అనుభవం ఉన్నవారితో మాట్లాడితే తెలుస్తాయి. రిషబ్ పంత్ కెప్టెన్‌గా మెరుగవ్వడానికి కష్టపడుతున్నాడు...

Image credit: Getty

మహేంద్ర సింగ్ ధోనీ తన కంటే సీనియర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గంగూలీ, ద్రావిడ్ వంటి వాళ్లతో ఆడాడు, జూనియర్లతో జట్టును నిర్మించాడు. రిషబ్ పంత్‌లోనూ ఈ స్కిల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. 

నా ఉద్దేశంలో రిషబ్ పంత్ భవిష్యత్తులో ఓ చక్కని నాయకుడు అవుతాడు. తన బ్యాటింగ్ నుంచి నాయకత్వాన్ని మొదలెడతాడు... త్వరలో టన్నుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం దొరకనుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్... 

click me!