నన్నెందుకు లాగుతున్నారు? అదీ, ఇదీ ఒక్కటేనా... దీప్తి శర్మ రనౌట్‌పై బెన్ స్టోక్స్...

First Published Sep 27, 2022, 12:27 PM IST

ఐసీసీ ఎన్ని వరల్డ్ కప్‌లు నిర్వహించినా 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో జరిగినంత హై డ్రామా మళ్లీ చూడలేమేమో. ఫైనల్ మ్యాచ్‌లో కనిపించిన మసాలా అలాంటిది. తాజాగా ఇంగ్లాండ్, ఇండియా మహిళల జట్ల మధ్య దీప్తి శర్మ చేసిన మన్కడింగ్ రనౌట్ వివాదంపై ఇంగ్లీష్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో 2019 వన్డే వరల్డ్ కప్‌ మరోసారి తెరపైకి వచ్చింది...

Ben Stokes

2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ట్విస్టులు, సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తాయి. హోరా హోరాగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ టైగా ముగిసింది. అయితే మార్టిన్ గుప్టిల్ వేసిన ఓ త్రో, క్రీజులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బెన్ స్టోక్స్ బ్యాటుకి తగులుతూ బౌండరీకి దూసుకెళ్లింది...

ఈ ఓవర్‌త్రోకి ఎన్ని పరుగులు ఇవ్వాలో తెలియక కాస్త అయోమయానికి గురైన అంపైర్లు, ఇంగ్లాండ్‌కి 6 పరుగులు అప్పగించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. ఇక్కడ 5 పరుగులు ఇచ్చినా న్యూజిలాండ్ 1 పరుగు తేడాతో వరల్డ్ కప్ విజేతగా నిలిచి ఉండేది...

నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ని ఎంచుకున్నారు అంపైర్లు. సూపర్ ఓవర్ డ్రామాలోనూ స్కోర్లు సమం కావడంతో బౌండరీలు ఎక్కువగా బాదిన ఇంగ్లాండ్‌ని వన్డే వరల్డ్ కప్ 2019 విజేతగా ప్రకటించారు అంపైర్లు...

Deepti Sharma

తాజాగా ఇంగ్లాండ్‌, భారత మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో చార్లోటే డీన్‌ని మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసింది దీప్తి శర్మ. దీనిపై ఇంగ్లాండ్ రచ్చ చేయడంతో 2019 వన్డే వరల్డ్ కప్ సంఘటనను మరోసారి తెరపైకి తెస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్...

Image credit: Getty

బౌండరీల కౌంట్ ద్వారా వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, ఐసీసీ రూల్‌ ప్రకారం రనౌట్ చేసిన దీప్తి శర్మను క్రీడా స్ఫూర్తి లేదని నిందించడం హ్యాస్పాస్పదంగా ఉందంటూ బీభత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా స్పందించాడు బెన్ స్టోక్స్...

‘మన్కడింగ్‌కీ, నా బ్యాటుకి బాల్ తగలడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ జనాలు దీనిలోకి నన్నెందుకు లాగుతున్నారు...’ అంటూ ఓ మీమ్‌ని పోస్టు చేశాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్...

click me!