ఆ ఇద్దరూ టీమ్‌కి రెండు కళ్లు... రోహిత్ శర్మ కామెంట్! టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు...

Published : Sep 27, 2022, 11:43 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులో వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లకు చోటు దక్కింది. 2019 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో నలుగురు వికెట్ కీపర్లతో ఆడిన టీమిండియా, ఈసారి మాత్రం ఇద్దరితోనే సరిపెట్టుకుంది. కెఎల్ రాహుల్ రూపంలో తాత్కాలిక వికెట్ కీపర్‌తో కూడా అందుబాటులో ఉన్నాడు...

PREV
16
ఆ ఇద్దరూ టీమ్‌కి రెండు కళ్లు... రోహిత్ శర్మ కామెంట్! టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు...
Image credit: PTI

రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఇద్దరినీ తుదిజట్టులో ఆడించడం కుదిరిపని కాదు. ఎందుకంటే టాపార్డర్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సెటిల్ అయిపోయారు. ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ పాండ్యాని పక్కనబెట్టలేని పరిస్థితి...

26
Image credit: Getty

ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌లపై విజయాలు అందుకోవాలంటే నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్ బౌలర్ ఫార్ములాతో బరిలో దిగే అవకాశం ఉంద. దీంతో ఒకే ఒక్క వికెట్ కీపర్‌కి తుదిజట్టులో చోటు ఉంటుంది. ఆ ప్లేస్ ఎవరికి దక్కుతుంది. యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ రిషబ్ పంత్‌కా? లేక సీనియర్ మోస్ట్ ఫినిషర్ దినేశ్ కార్తీక్‌కా...

36

‘టీ20 వరల్డ్ కప్‌ టోర్నీకి ముందు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ కూడా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలని అనుకుంటున్నా. వాళ్లిద్దరూ ఇప్పుడు టీమ్‌కి చాలా ముఖ్యమైన ప్లేయర్లు. ఆసియా కప్‌ టోర్నీలోనూ ఇద్దరూ చెరో మూడు మ్యాచులు ఆడారు...

46

నా ఉద్దేశంలో రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్‌కి కాస్త ఎక్కువ గేమ్ టైమ్ అవసరం. తను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం మాత్రమే బ్యాటింగ్ చేశాడు. కొన్నిసార్లు మూడు బంతులు, మరికొన్ని సార్లు ఒక్క బంతి మాత్రమే... ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు బంతులే ఆడాడు. ఆ ప్రాక్టీస్ సరిపోదు కదా...

56
Dinesh Karthik

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఎవరిని ఆడిస్తామో తెలీదు. సౌతాఫ్రికా బౌలింగ్‌ని బట్టి టీమ్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయి. లెఫ్ట్ హ్యాండర్ అవసరం అనుకుంటే రిషబ్ పంత్‌ని ఆడిస్తాం. లేదా దినేశ్ కార్తీక్‌ని ఆడిస్తాం...

66
Image credit: Getty

ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేసేందుకు ప్లేయర్లు సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతోనే వరల్డ్ కప్ టీమ్‌ని రెఢీ చేస్తున్నాం... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

Read more Photos on
click me!

Recommended Stories