Rohit Sharma
Rohit Sharma-Sachin Tendulkar: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు. శ్రీలంక బౌలింగ్ ను చిత్తుచేస్తూ గ్రౌండ్ లో అన్ని వైపులకు తదైన బౌండరీ షాట్లను బాదాడు.
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం (ఆగస్టు 4) శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ 64 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 3 వన్డేల సిరీస్‌లో అతనికిది వరుసగా రెండో అర్ధశతకం. తొలి మ్యాచ్‌లో హిట్‌మన్ 58 పరుగులు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
శ్రీలంక బౌలర్లపై బ్యాట్ తో విరుచుకుపడుతూ తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. హిట్‌మ్యాన్ 145.45 స్ట్రైక్ రేట్ తన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ క్రమంలోనే తన పేరిట ఓ పెద్ద రికార్డును నమోదు చేసుకున్నాడు. భారత లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
sachin rohit
రోహిత్ శర్మ అర్ధశతకం సాధించి ఓపెనర్‌గా, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్) అత్యధిక ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 120 సార్లు ఓపెనర్‌గా 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. రోహిత్ 121వ సార్లు ఓపెనర్ గా 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. భారత క్రికెట్ లో ఒపెనర్ గా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ రోహిత్ శర్మ.
sachin rohit shots
నాలుగోసారి వన్డే క్రికెట్‌లో రోహిత్ 10 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుకు చేరువయ్యాడు. సెహ్వాగ్ వన్డేల్లో 7 సార్లు 10 ఓవర్లలోనే ఫిఫ్టీ సాధించాడు. సచిన్ టెండూల్కర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ ఒక్కోసారి హాఫ్ సెంచరీ కొట్టారు.
sachin tendulkar rohit sharma
వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ 300 సిక్సర్లు పూర్తి చేశాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఓపెనర్‌గా నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు, భారత్ తరఫున వన్డేల్లో 300 సిక్సర్లు బాదిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లేడు. రోహిత్ తన కెరీర్‌లో 175 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును నెలకొల్పాడు.