'వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ'.. విరాట్ గురించి ధోనీ ఏమ‌న్నాడో తెలుసా?

First Published | Aug 3, 2024, 10:17 PM IST

MS Dhoni - Virat kohli : విరాట్ కోహ్లీతో ఆడటం త‌న‌కు ఇప్పటికీ ఇష్టమ‌ని భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు. అలాగే, కింగ్ కోహ్లి బ్యాటింగ్‌పై ఆందోళన వ్య‌క్తం చేశారు. విరాట్ గురించి చాలాకాలం త‌ర్వాత‌ తొలిసారి ధోని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
 

MS Dhoni, Virat Kohli

MS Dhoni - Virat kohli : ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టుకు అత్యుత్తమ కెప్టెన్ ఎంఎస్ ధోని. తన అద్భుతమైన కెప్టెన్సీతో టీమిండియా మ్యాచ్ టెంపోను మార్చేవాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు జట్టును విజయతీరాలకు చేర్చాడు. చాలా కాలం త‌ర్వాత ఈ ఛాంపియ‌న్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. 

ఎంఎస్ ధోనీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీ ఒకర‌ని పేర్కొన్నాడు. అలాగే, తాము కరెంట్‌ అఫైర్స్‌, క్రికెట్‌ గురించి తరచూ మాట్లాడుకుంటామ‌నీ, అందుకే ఇద్దరి మధ్య బంధం బాగా కుదిరిందన్నాడు. 


విరాట్ కోహ్లీ, తాను భారత జట్టులో చాలా కాలం పాటు గ్రౌండ్ లో క‌లిసి ఆడామ‌ని చెప్పిన ధోని.. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు విరాట్‌తో ఆడడమంటే ఇష్టమ‌ని చెప్పాడు. ఎందుకంటే ఇద్దరికీ వికెట్ల మ‌ధ్య‌ పరుగెత్తడం, పరుగులు చేయడం ఇష్టం కాబట్టి అది సరదాగా ఉంటుందన్నాడు. 

విరాట్ కోహ్లీతో ఆడటం ఇప్పటికీ త‌న‌కు ఇష్టమ‌ని చెప్పిన ధోని భాయ్.. ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా కలుసుకుంటూ మాట్లాడుకుంటామ‌నీ, కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నామ‌ని పేర్కొన్నాడు. త‌మ మ‌ధ్య మంచి బంధం ఉంద‌ని తెలిపాడు. 

కాగా, ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్నాడు. చాలా కాలం త‌ర్వాత ధోని ఇలా విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

MS Dhoni, Virat Kohli, Dhoni-Virat, IPL 2024,

ధోని కామెంట్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇదిలావుండ‌గా, ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ ఇప్పుడు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భార‌త్-శ్రీలంక సిరీస్ తొలి వ‌న్డే మ్యాచ్ లో 24 పరుగులు చేశాడు. 

Latest Videos

click me!