IPL లో గబ్బర్ రికార్డు బద్దలుకొట్టిన రోహిత్ శర్మ

Rohit sharma: శిఖర్ ధావన్ 6,769 పరుగుల రికార్డును బద్దలుకొడుతూ ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అతను ప్రస్తుతం 8326 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Rohit Sharma becomes second highest run scorer in IPL history, virat kohli tops in telugu rma
Rohit Sharma

Rohit Sharma becomes second highest run scorer in IPL history: భారత జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. గబ్బర్ శిఖర్ ధావన్‌ను అధిగమించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో రెండో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 

వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్‌లో  హిట్ మ్యాన్ ఈ ఘనత సాధించాడు. సమయంలో రోహిత్ ఖాతాలో 6,786 ఐపీఎల్ పరుగులు ఉన్నాయి. 

Rohit Sharma becomes second highest run scorer in IPL history, virat kohli tops in telugu rma
Rohit Sharma

ఈ మ్యాచ్ లో 45 బంతుల్లో 76* పరుగులు చేశాడు అందులో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 168.89 గా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇది  రోహిత్ కు తొలి అర్ధ సెంచరీ.

రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఏడు ఇన్నింగ్స్‌లలో 158 పరుగులు చేశాడు. సగటు 26.33, స్ట్రైక్ రేట్ 154.90తో ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. మొత్తంగా 264 ఐపీఎల్ మ్యాచ్‌లు, 259 ఇన్నింగ్స్‌లలో దక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రోహిత్ 6,786 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోరు 109* పరుగులు. 

 


Image Credit: ANI

ఐపీఎల్ లో అత్యధిక పరుగులు.. రెండో స్థానంలో రోహిత్ శర్మ

శిఖర్ ధావన్ 222 ఐపీఎల్ మ్యాచ్‌లలో 6,769 పరుగులు చేశాడు, సగటు 35.25, స్ట్రైక్ రేట్ 127 పైగా, రెండు సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు. అత్యధిక స్కోరు 106* పరుగులు.  ఇప్పుడు రోహిత్ శర్మ గబ్బర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సాధించాడు. 

Rohit Sharma. (Photo- IPL)

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల స్కోరర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్ విరాట్ కోహ్లీ. అతను 8,326 పరుగులు చేశాడు. 39.27 సగటు, స్ట్రైక్ రేట్ 132.26 తో కోహ్లీ బ్యాటింగ్ సాగింది. అలాగే, 8 సెంచరీలు, 59 అర్ధ సెంచరీలు సాధించాడు.

Rohit Sharma (Photo: Mumbai Indians)

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయా?

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు విజయాలు, ఆరు ఓటములతో చివరి స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన దాదాపు అన్ని మ్యాచ్ లను గెలుచుకోవడంతో పాటు నెట్ రన్ రేటు పై ఆధారపడుతుంది. 

Latest Videos

vuukle one pixel image
click me!