గాయం కారణంగా ఫీల్డింగ్‌కి రాని రోహిత్, పూజారా... ఐదో టెస్టుకి ముందు టీమిండియాకి షాక్...

First Published Sep 5, 2021, 11:11 PM IST

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో భారీ స్కోరు అందించాడు ఓపెనర్ రోహిత్ శర్మ. పూజారాతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి, మంచి ఫ్లాట్‌ఫాం నెలకొల్పాడు. అయితే ఐదో టెస్టులో ఈ ఇద్దరూ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది...

రోహిత్ శర్మ మోకాళ్ల మీద, తొడల మీద బంతి బలంగా తాకింది. ఈ కారణంగా రోహిత్ తొడ కండరాలు ఎర్రగా కమిలిపోవడం స్పష్టంగా కనిపించింది...

అలాగే తన శైలికి విరుద్ధంగా వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛతేశ్వర్ పూజారా, సింగిల్స్ తీసే ప్రయత్నంలో గాయపడ్డాడు. సింగిల్ తీసేటప్పుడు అతని అరికాలు మడతపడింది...

అయితే ఫిజియో చికిత్స తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన ఛతేశ్వర్ పూజారా... పెయిన్ కిల్లర్స్ వేసుకుని నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు...

గాయాల కారణంగా రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా ఫీల్డింగ్‌కి రాకపోవడంతో ఆ ఇద్దరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్ చేశారు...

వీరిద్దరూ ఐదో టెస్టు సమయానికి కోలుకోకపోతే... భారత జట్టు తరుపున సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది... 

మొట్టమొదటి విదేశీ సెంచరీ చేసి, ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే, భారత జట్టుకి కష్టాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు...

అదీకాకుండా ఐపీఎల్ 2021 సీజన్ దగ్గరికి వస్తున్న సమయంలో రోహిత్ శర్మ గాయపడడంతో ఫేజ్ 2లో ‘హిట్ మ్యాన్’ పూర్తిగా అందుబాటులో ఉంటాడా? లేదా? అని భయపడుతున్నారు అభిమానులు...

ఐపీఎల్‌ 2021 ఫేజ్ 2లో రోహిత్ శర్మ ఉన్నా, లేకపోయినా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చేమో కానీ ఆ తర్వాత జరిగే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో రోహిత్ కీ ప్లేయర్‌. కాబట్టి ఆ సమయానికి హిట్‌మ్యాన్ ఫిట్‌గా ఉండడం అత్యంత ఆవశ్యకం...

click me!