రెండో ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్ ఠాకూర్ మెరుపు హాఫ్ సెంచరీ... సిరీస్‌లో రిషబ్ పంత్ తొలిసారిగా...

First Published Sep 5, 2021, 7:45 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ అందుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 65 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు శార్దూల్ ఠాకూర్...

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన శార్దూల్ ఠాకూర్... భారత జట్టు తరుపున నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

ఇంతకుముందు హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్ వృద్ధిమాన్ సాహా కూడా 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి... రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేయగలిగారు... వీరిలో భువీ 2014 ఇంగ్లాండ్ టూర్‌లో ఈ ఫీట్ సాధించాడు.

ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ స్టేడియంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

మరో ఎండ్‌లో రిషబ్ పంత్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాబిన్‌సన్ ఓవర్‌లో సింగిల్ తీసేందుకు ముందుకొచ్చిన రిషబ్ పంత్, ఫీల్డర్ త్రో వేసేలోపు వెనక్కి వెళ్లలేకపోయాడు...

అయితే మొయిన్ ఆలీ డైరెక్ట్ హిట్ కొట్టేందుకు వేసిన త్రో వికెట్లకు తగలకపోవడం, ఆ తర్వాత అటువైపు ఎండ్‌లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకుని, కీపర్‌కి ఇచ్చేందుకు లేటు చేయడంతో రిషబ్ పంత్ బతికిపోయాడు...

72 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో ఓవర్టన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 412 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా.

రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్ కలిసి ఏడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఇది రెండో శతాధిక భాగస్వామ్యం.

రిషబ్ పంత్ తన స్టైల్‌కి విరుద్దంగా నెమ్మదిగా ఆడుతూ సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. 105 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు పంత్. రిషబ్ పంత్‌కి ఇది ఏడో హాఫ్ సెంచరీ.

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించిన రిషబ్ పంత్, మొయిన్ ఆలీకి రివర్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 414 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది టీమిండియా.

click me!