మొదటి రెండు టెస్టులకు రోహిత్, ఇషాంత్ దూరం... బీసీసీఐ అధికారిక ప్రకటన...

First Published Nov 24, 2020, 1:52 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ గాయం కారణంగా మొదటి రెండు టెస్టు మ్యాచులకు దూరం కానున్నారు. మొదట టెస్టు సిరీస్ మొత్తానికి రోహిత్, ఇషాంత్ దూరమయ్యారని వార్తలు వచ్చినా, నేషనల్ క్రికెట్ అకాడమీ సూచనతో లేటుగా అయినా ఆస్ట్రేలియాకి ఈ ఇద్దరినీ పంపాలని నిర్ణయించుకుంది బీసీసీఐ.

ప్రస్తుతం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ... గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేశారు వైద్యులు.
undefined
దీంతో టెస్టు సిరీస్ నుంచి కూడా ఈ ఇద్దరూ తప్పుకున్నట్టే అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రోహిత్ శర్మపై బీసీసీఐ పక్షపాతం చూపిస్తోందని ట్రోల్స్ కూడా వచ్చాయి.
undefined

Latest Videos


సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండడంతో వెంటనే స్పందించిన బీసీసీఐ... మొదటి రెండు టెస్టులకు మాత్రమే రోహిత్, ఇషాంత్ శర్మ దూరం కాబోతున్నారని, ఆ తర్వాతి రెండు టెస్టులు ఆడతారని సెలవిచ్చింది.
undefined
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత డిసెంబర్ 8న ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనున్నారు రోహిత్, ఇషాంత్ శర్మ...
undefined
వెళ్లిన వెంటనే 14 రోజుల క్వారంటైన్ పీరియడ్‌లో గడపాల్సి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 17న మొదలయ్యే మొదటి టెస్టుతో పాటు డిసెంబర్ 26న మొదలయ్యే రెండో టెస్టు కూడా మిస్ అవ్వబోతున్నారు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ.
undefined
మొదటి రెండు టెస్టులకు రోహిత్ శర్మ దూరం కావడంతో శ్రేయాస్ అయ్యర్‌ను అతని స్థానంలో రిజర్వు బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ...
undefined
వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్... టెస్టు సిరీస్ ముగిసేవరకూ భారత జట్టుతోనే కొనసాగుతాడు.. ఇషాంత్ శర్మకు రిప్లేస్‌మెంట్‌గా కార్తీక్ త్యాగి లేదా ఇషాన్ పోరెల్‌లో ఎవరో ఒకరిని తీసుకోనుంది.
undefined
ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అండర్ 19 పేసర్ కార్తీక్ త్యాగి, ఆసీస్ టూర్‌లో నెట్ బౌలర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే...
undefined
click me!