అటు టీ20 వరల్డ్ కప్ 2024, ఇటు లోక్‌సభ ఎన్నికలు... యూఏఈలో ఐపీఎల్ 2024 మ్యాచులు?

First Published | Aug 1, 2023, 5:23 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి బీసీసీఐ అనుకున్నంత ఆదరణ దక్కలేదు. అందుకేనేమో ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగేలా కట్టుదిట్టంగా ప్రణాళికలు రచించారు. అనుకున్నట్టే 2023 సీజన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ సాధించింది..
 

Dhoni IPL Trophy

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా, సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనే చేతులు ఎత్తేసినప్పుడు, ఐపీఎల్ వల్లే భారత క్రికెట్‌కి ఈ గతి పట్టిందని తెగ ఫీలైన వాళ్లంతా... ఐపీఎల్ 2023 సీజన్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు..

అయితే ఐపీఎల్ 2024 సీజన్‌కి వరుస గండాలు వెంటాడుతున్నాయి. మార్చి చివర్లో మొదలై మే చివరి దాకా ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి. అయితే జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కాబోతున్నట్టు ఐసీసీ ప్రకటించింది...


జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంటే, దానికి కనీసం 15-20 రోజుల ముందే టీమిండియా ప్లేయర్లు, ఐపీఎల్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేకపోతే టీ20 వరల్డ్ కప్ 2021 సమయంలో ఏం జరిగిందో, అదే సీన్ రిపీట్ అవుద్ది..

మార్చి 11 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతోంది టీమిండియా. దీంతో మార్చి 15-20 వరకూ ఐపీఎల్ 2024 సీజన్‌ని ప్రారంభించలేని పరిస్థితి. దీనికి తోడు వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి...

Image credit: PTI

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఐపీఎల్ మ్యాచులకు అనుమతి దొరకకపోవచ్చు. ఇంతకుముందు ఇదే కారణంగా 2009లో సౌతాఫ్రికాలో, 2014లో యూఏఈలో ఐపీఎల్ మ్యాచులు జరిగాయి... ఈసారి కూడా యూఏఈ వేదికగానే ఐపీఎల్ 2024 సీజన్ జరగవచ్చని సమాచారం..
 

లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకూ యూఏఈలో, ఆ తర్వాత ఇండియాలో మ్యాచులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈసారి డబుల్ హెడ్డర్ మ్యాచుల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది...

Image credit: PTI

సాధారణంగా 56 రోజుల పాటు ఐపీఎల్ సాగుతుంది. అయితే ఈసారి 45 రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్‌ని ముగించేలా భారత క్రికెట్ బోర్డు, వ్యూహరచన చేయబోతుందట. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. 

Latest Videos

click me!