13 ఏళ్ల తర్వాత మాహీని కలిశా! టీమ్‌లో అందరూ సార్ అని పిలుస్తుంటే... రాబిన్ ఊతప్ప కామెంట్...

Published : Jul 29, 2022, 04:10 PM IST

15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ముంబై ఇండియన్స్, పూణే వారియర్స్ ఇండియా, రాజస్థాన్ రాయల్స్‌ తరుపున ఆడిన రాబిన్ ఊతప్ప, 2014లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...

PREV
18
13 ఏళ్ల తర్వాత మాహీని కలిశా! టీమ్‌లో అందరూ సార్ అని పిలుస్తుంటే... రాబిన్ ఊతప్ప కామెంట్...
Robin Uthappa

2020 సీజన్‌‌కి ముందు కేకేఆర్ నుంచి రాజస్థాన్ రాయల్స్ వచ్చిన రాబిన్ ఊతప్ప, ఆ సీజన్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. 2021 సీజన్‌కి ముందు క్యాష్ ట్రేడ్ ద్వారా సీఎస్‌కేలోకి వెళ్లాడు రాబిన్ ఊతప్ప...

28

ప్లేఆఫ్స్ మ్యాచుల్లో సీనియర్ సురేష్ రైనాని కాదని రాబిన్ ఊతప్పని తుది జట్టులోకి తీసుకొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, సూపర్ సక్సెస్ సాధించింది. 2021 నాకౌట్ మ్యాచుల్లో 3 మ్యాచుల్లో 110+ పరుగులు చేసిన ఊతప్ప, సీఎస్‌కే నాలుగో టైటిల్ గెలవడంతో తనవంతు పాత్ర పోషించాడు...

38
Robin Uthappa

ఈ పర్పామెన్స్ కారణంగానే  2022 ఐపీఎల్ మెగా వేలంలో ఊతప్పను రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 2022 సీజన్‌లో 12 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 230 పరుగులు చేశాడు ఊతప్ప. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

48

‘సీఎస్‌కే‌కి సెలక్ట్ అయినప్పుడు, దాదాపు 13-14 ఏళ్ల తర్వాత మాహీతో కలిసి ఆడాను. నేను టీమ్‌తో చేరిన తర్వాత అందరూ మాహీ భాయ్, మాహీ సార్ అని పిలుస్తున్నారు...

58

నేను కాస్త అయోమయానికి గురయ్యా. వెళ్లి అతన్నే అడిగా. నేను నిన్ను మాహీ అని పిలవచ్చా? లేక మాహీ భాయ్ అని పిలవమంటావా? అని అడిగాడు... అతను వెంటనే దీని గురించి అంత ఆలోచించకు... నువ్వు ఎలా పిలవాలనుకుంటే అలా పిలువు...

68
Robin Uthappa

నేను అప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడు అలాగే ఉన్నాను. నాలో ఏ మార్పు రాలేదు... నువ్వు నన్ను మాహీ అనే పిలవచ్చు.. అని చెప్పాడు. టీమ్‌లో నేను ఒక్కడినే కెప్టెన్ని మాహీ అని పిలిచేవాడిని...

78
Robin Uthappa-Dhoni

మా మధ్య అనుబంధం అలాంటిది. అది క్రికెట్‌కి మాత్రమే పరిమితమైంది కాదు. మేం కలిసి ఆడాం, కలిసి కబుర్లు చెప్పుకున్నాం. ఫీల్డ్‌లో కలిసి ఎమోషన్స్ షేర్ చేసుకున్నాం...

88

మాకు బిడ్డ పుట్టిన వెంటనే ఆ ఫోటోని మాహీకి పంపాను... అతను వెంటనే ‘పాప అచ్చు నీలాగే ఉంది...’ అంటూ రిప్లై ఇచ్చాడు. 13 ఏళ్ల క్రితం జట్టులో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పటికే మేం ఇద్దరం కలిసి కూర్చొని ఛిల్ అవుతూ ఉంటాం...’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప...

Read more Photos on
click me!

Recommended Stories