బీసీసీఐ నిబంధనల కారణంగా భారత పురుష క్రికెటర్లు, విదేశీ క్రికెట్ లీగుల్లో పాల్గొనకూడదు. అలా ఆడితే వారికి భారత జట్టు తరుపున కానీ, ఐపీఎల్‌లో కానీ, దేశవాళీ టోర్నీల్లో కానీ ఆడే అవకాశం ఉండదు.. ప్రవీణ్ తాంబే, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు విదేశీ లీగుల్లో పాల్గొనడం వల్ల ఐపీఎల్ ఆడే అవకాశాన్ని కోల్పోయారు... అయితే జట్టులో ప్లేస్ పోటీ తీవ్రతరం అవుతున్న తరుణంలో భారత క్రికెటర్లను కూడా విదేశీ లీగుల్లో ఆడించాలని భావిస్తోందట బీసీసీఐ...
2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వంటి జట్లకి ఆడిన గిల్‌క్రిస్ట్... ఐపీఎల్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
26
‘భారత క్రికెటర్లను విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతిస్తే చాలా బాగుంటుంది. నా ఉద్దేశంలో ఈ నిర్ణయం ఐపీఎల్‌కి ఎలాంటి నష్టం చేయదు... ఐపీఎల్‌కి మరింత ప్రమోషన్ దక్కుతుంది..
36
ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాలో భారత ప్లేయర్లు ఆడితే, వారికి కూడా విదేశీ పిచ్‌లపై ఆడిన అనుభవం పెంచుకోవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది...
46
అయితే ఇప్పటికే భారత ప్లేయర్లను, విదేశీ లీగుల్లో ఎందుకు ఆడనివ్వరో ఇప్పటికీ అర్థం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్...
56
‘ఐపీఎల్‌లో ఆడిన ఆరు సీజన్లు ఎంతగానో ఎంజాయ్ చేశా. అదో గొప్ప అనుభవం. టీ20 వరల్డ్‌లో అదే మొట్టమొదటి కాంపిటీషన్. అయితే ఐపీఎల్ వల్ల బీసీసీఐ లాభపడినట్టే, మిగిలిన బోర్డులు కూడా లాభాలు ఆర్జించాలంటే భారత ప్లేయర్లను విదేశీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతించాలి...
66
ఐపీఎల్ కోసం ఐసీసీ ఏకంగా రెండున్నర నెలల విండోని కేటాయించింది. నేను ఐపీఎల్‌ను తప్పు పట్టడం లేదు, కానీ భారత ప్లేయర్లను విదేశీ లీగుల్లో ఎందుకు ఆడించరనే ప్రశ్నకు మాత్రం నాకు ఇప్పటిదాకా సరైన సమాధానం దొరకలేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్...