9 సెంచరీలు లేవు! టెండూల్కర్ రికార్డులను కొట్టేస్తానని చెప్పాడు... విరాట్ కోహ్లీ గురించి...

Published : Jul 29, 2022, 02:00 PM IST

మూడేళ్లుగా సెంచరీకి, విరాట్ కోహ్లీ మధ్య ఫ్రెండ్‌షిప్ చెడిపోయినట్టుంది. అంతకుముందు వరకూ కేవలం 10 ఏళ్లల్లో 20 వేలకు పైగా పరుగులు చేసి, శతకాల మోత మోగించిన విరాట్ కోహ్లీ... తన 71వ సెంచరీని అందుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు... 

PREV
18
9 సెంచరీలు లేవు! టెండూల్కర్ రికార్డులను కొట్టేస్తానని చెప్పాడు... విరాట్ కోహ్లీ గురించి...
Image credit: Getty

ఇప్పటిదాకా టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలతో మొత్తంగా 70 సెంచరీలు సాధించాడు. అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్ (71) తర్వాతి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ...

28

వన్డేల్లో 43 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 49 వన్డేల రికార్డుకి 6 సెంచరీల దూరంలో నిలిచాడు. అయితే 9 ఏళ్ల క్రితమే సచిన్ రికార్డును బ్రేక్ చేస్తానని చెప్పాడట ఓక్లే స్పోర్ట్స్ మార్కెటింగ్ హెడ్ అశ్విన్ కృష్ణన్...

38

‘విరాట్ కోహ్లీ వన్డేల్లో సాధించిన రికార్డులు అసాధారణం. సచిన్ టెండూల్కర్ రికార్డులకు విరాట్ కోహ్లీ చాలా దగ్గరగా వచ్చేశాడు. టెండూల్కర్ రికార్డులను విరాట్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది పెద్ద విషయం కాదు...

48

విరాట్ కోహ్లీ గురించి ఓ చిన్న విషయం చెప్పాలి. 2013లో మేం ఓక్లేకి బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీని తీసుకోవాలని అనుకున్నాం. మేమంతా కూర్చున్నాం...

58
Virat Kohli

విరాట్ కోహ్లీ తన మేనేజర్‌ బంటీతో కలిసి వచ్చాడు. నేను ఛాంపియన్స్ లీగ్‌ కోసం ముంబైలో ఉన్నా! కేవలం కోహ్లీ కాంట్రాక్ట్ కోసమే ఇక్కడికి వచ్చా. అప్పుడు విరాట్ కోహ్లీకి 24 ఏళ్లు ఉంటాయి...

68
Virat Kohli

వన్డేల్లో 9 సెంచరీలు మాత్రమే చేశాడు. ‘వన్డేల్లో అయితే పాజీ (సచిన్ టెండూల్కర్) రికార్డులనైతే కచ్ఛితంగా అందుకుంటా. పాజీ 49 సెంచరీలు చేశాడు...’... అన్నాడు.

78

నేను ఆ మాటలు విని షాక్ అయ్యాడు. అప్పటికి సచిన్ రికార్డులను అందుకోవాలంటే ఇంకా 40 సెంచరీలు చేయాలి. ఆ వయసులో అంత నమ్మకంగా మాట్లాడిన విని షాక్ అయ్యా. విరాట్ కోహ్లీ గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా నాకు మాత్రం విరాట్ మాటలే గుర్తుకు వస్తాయి...

88

ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడని చాలా మంది అంటున్నారు. కానీ నా ఉద్దేశంలో అతని మైండ్‌సెట్ ఇప్పుడు సరిగ్గా లేదంతే. అతని క్వాలిటీని మాత్రం ఎవ్వరూ దూరం చేయలేరు..’ అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్ కృష్ణన్..

Read more Photos on
click me!

Recommended Stories