వారితో మ్యాచ్ ఎప్పుడూ మజాగానే ఉంటుంది, కానీ ఓడించితీరతాం... న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్...

First Published May 18, 2021, 12:40 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సరిగ్గా నెల రోజుల సమయమే మిగిలి ఉంది. టెస్టు ఫార్మాట్‌తో నిర్వహిస్తున్న ఈ తొలి ఐసీసీ మెగా టోర్నీ టైటిల్ గెలవాలని అటు విరాట్ కోహ్లీ, ఇటు కేన్ విలియంసన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఫైనల్‌లో టీమిండియాపై గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్.

ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే టీమిండియా కెప్టెన్ జెర్సీ నెంబర్ 18 కాగా, కేన్ విలియంసన్ జెర్సీ నెం. 22...
undefined
‘టీమిండియాతో పోటీ ఎప్పుడూ మజాగానే ఉంటుంది. వారితో ఫైనల్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం... ఫైనల్‌లో గెలిచి, టైటిల్ కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నాం...
undefined
ఇండియా ఎప్పుడూ చాలా పటిష్టమైన జట్టే. ఆ జట్టులో చాలామంది వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ ఫలితం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది....
undefined
తేలిగ్గా దక్కే విజయం కంటే, కష్టపడి, గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థితో పోరాడి గెలిచి దక్కించుకునే విజయం ఇచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్.
undefined
న్యూజిలాండ్ స్టార్ పేసర్ నీల్ వాగ్నర్ కూడా ఇండియాపై ఫైనల్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు...
undefined
‘మేం ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌ను వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు ప్రాక్టీస్‌గా భావించడం లేదు. ఇది కూడా మాకు కీలకమే. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించగలిగితే, ఫైనల్‌కి ముందు సగం విజయం సాధించనట్టే...
undefined
టీమిండియా ఫాస్ట్ బౌలర్లు విభిన్న పరిస్థితుల్లో, విభిన్న పిచ్‌లపై చక్కగా రాణించారు. ఇంగ్లాండ్ పరిస్థితులు వారికి బాగా అనుకూలించొచ్చు కూడా.
undefined
అయితే ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా బౌలింగ్‌ చేయాలో, బ్యాట్స్‌మెన్‌ను ఎలా నియంత్రించాలో న్యూజిలాండ్ బౌలర్లకు బాగా తెలుసు.. ’ అంటూ కామెంట్ చేశాడు నీల్ వాగ్నర్...
undefined
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి, అక్కడి పరిస్థితులకు అలవాటు పడితే, టీమిండియా ఎలాంటి జట్టునైనా ఓడించగలదని అభిప్రాయపడ్డాడు.
undefined
‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఫైనల్‌కి ముందే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడడం చాలా ముఖ్యం...
undefined
ఓ క్రీడాకారుడిగా టీమిండియాకి ఆడడం ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఫైనల్ ఆడే జట్టులో నాకు అవకాశం వస్తే, నేను చేయగలిగిన దాన్ని నేను చేస్తాను...’ అంటూ తెలిపాడు హనుమ విహారి.
undefined
click me!