జాక్వస్ కలీస్‌ని అవుట్ చేసేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్... బయటపెట్టిన బ్రెట్‌ లీ...

Published : Jul 15, 2022, 06:07 PM IST

జాక్వస్ కలీస్... పరుగులు చేయడంలో సచిన్ టెండూల్కర్‌తో, వికెట్లు తీయడంలో జహీర్ ఖాన్‌తో పోటీపడిన నిఖార్సయిన ఆల్‌రౌండర్. అంతర్జాతీయ కెరీర్‌లో 25 వేల పరుగులు, 560కి పైగా వికెట్లు తీసిన జాక్వస్ కలీస్‌ని అవుట్ చేయడానికి బ్రెట్‌లీ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా తెగ కష్టపడేవాళ్లు...

PREV
19
జాక్వస్ కలీస్‌ని అవుట్ చేసేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్... బయటపెట్టిన బ్రెట్‌ లీ...

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆడిన జాక్వస్ కలీస్, 2014లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.కేకేఆర్‌కి ఆడిన సమయంలో వసీం అక్రమ్, బ్రెట్‌లీలతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు జాక్వస్ కలీస్...

29

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైం గ్రేట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందిన వసీం అక్రమ్, తన కెరీర్‌లో 800లకు పైగా వికెట్లు పడగొట్టాడు. అక్రమ్ లెఫ్ట్ ఆర్మ్‌తో వేసే రివర్స్ స్వింగ్ ఆడేందుకు దిగ్గజ బ్యాటర్లు ఇబ్బందిపడేవాళ్లు...

39

10 ఏళ్ల క్రితం కేకేఆర్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన వసీం అక్రమ్‌తో తన అనుభంధం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ...

49

‘జాక్వస్ కలీస్‌కి మాకు పెద్ద తలనొప్పిలా మారేవాడు. అతన్ని నెట్స్‌లో అవుట్ చేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రిజల్ట్ మాత్రం దక్కేది కాదు. అయితే ఎన్ని రకాలుగా బౌలింగ్ మార్చినా, కలీస్ ఈజీగా షాట్స్ ఆడేవాడు...

59

కలీస్‌ను అవుట్ చేయాలని ఎంత ప్రయత్నించినా రిజల్ట్ మాత్రం వచ్చేది కాదు. నేనే కాదు, ప్రతీ బౌలర్ కూడా జాక్వస్ కలీస్ వికెట్ తీసేందుకు చాలా కష్టపడేవాళ్లు. కొత్త బాల్‌ని కూడా ఎంతో ఈజీగా మిడిల్ చేస్తూ షాట్స్ ఆడేవాడతను...

69
Jacques Kallis

నేను వెళ్లి వసీం అక్రమ్‌ని ఎలా అవుట్ చేయాలో చెప్పమని అడిగాను. అతను బాల్ షేప్ పోగొట్టి, సీమ్ పొజిషన్ మార్చి బౌలింగ్ చేయమని సలహా ఇచ్చాడు. నేను అలాగే ప్రయత్నించా. అయితే నాకు రిజల్ట్ మాత్రం రాలేదు...

79

దాంతో తానే బౌలింగ్ చేసి చూపించడానికి ముందుకు వచ్చాడు. వసీం స్పైక్ షూస్ కూడా వేసుకోలేదు. వసీం వేసిన బంతి మెరుపు వేగంతో వికెట్ల మీదుగా దూసుకుపోయింది. అతను వికెట్ల వెనక నుంచి బంతిని స్వింగ్ చేస్తాడు...

89

రెండో బంతికి అంతే. జాక్వస్ కలీస్‌కి రివర్స్ స్వింగ్‌ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి, ఈ బాల్ చూడు అని కనుగొడుతూ చెప్పాడు వసీం. అంతే మళ్లీ వెనక్కి వెళ్లి ఒక్క బంతి స్ట్రైయిక్ లెంగ్త్‌తో వేశాడు. అంతే క్లీన్ బౌల్డ్... 

99

వరుసగా రెండు బాల్స్ రివర్స్ స్వింగ్‌లో రావడంతో జాక్వస్ కలీస్, మూడో బంతికి కూడా అదే వస్తుందని అనుకున్నాడు. కానీ వసీం అక్రమ్ చాలా తెలివిగా లైన్ మార్చి వికెట్ తీశాడు. ఆ బాల్ వేయగానే వసీం అక్రమ్ దగ్గరికి వెళ్లి... ‘యూ ఆర్ జీనియస్’ అని అన్నాను...’ అంటూ తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ...

click me!

Recommended Stories