భారత జట్టు ప్లేయర్లకు తరుచుగా రెస్ట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. సరిగ్గా మూడు మ్యాచులు ఆడితే చాలు, తర్వాతి సిరీస్ నుంచి తప్పుకోవడంపై మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ విషయంపై స్పందించాడు...
1974 కరేబియన్ టూర్‌లో సునీల్ గవాస్కర్ సంచలన ప్రదర్శనతో స్టార్‌గా ఎదిగాడు. ఆ టూర్‌లో 154 పర్యటనతో 774 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్, ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇప్పటికీ టాప్‌లో నిలిచాడు...
28
టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా, 34 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులు క్రియేట్ చేసిన సునీల్ గవాస్కర్, విండీస్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఆ రేంజ్‌లో రాణించాడు...
38
‘విండీస్ టూర్‌లో చివరి టెస్టు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగింది. ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత నా జగ్‌లో నీళ్లు తాగాలని ప్రయత్నించా. అందులో ఓ ఐస్ ముక్క, నా పళ్లకి తగిలింది... అంతే విపరీతమైన నొప్పి...
48
తర్వాతి రోజే మాకు టెస్టు మ్యాచ్. అప్పటికే మేం 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్నాం. సిరీస్ గెలవాలంటే ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. నేను ఎలాగైనా ఆడాలనే నిర్ణయించుకున్నాం..
58
ఆ రోజు నొప్పితో నిద్రపట్టలేదు. నిద్రపట్టడానికి స్లిపింగ్ ట్యాబ్లెట్స్ అడిగినా, కనీసం పెయిన్ కిల్లర్ ఇవ్వమని అడిగినా టీమ్ మేనేజర్ ఒప్పుకోలేదు. పెయిన్ కిల్లర్ వాడినా, స్లిపింగ్ పిల్స్ వాడినా మ్యాచ్ సమయంలో పూర్తి యాక్టీవ్‌గా ఉండలేవని చెప్పాడు...
68
దేశం కోసం ఆడేటప్పుడు నా నొప్పిని కూడా లెక్కచేయలేదు. జట్టు కోసం ఏం చేయడానికైనా, ఎలాంటి నొప్పిని భరించడానికైనా సిద్ధంగా ఉండేవాళ్లం. ఎందుకంటే దేశం కోసం ఆడడం కంటే ఏదీ ఎక్కువ కాదు...
78
ఆ నొప్పిని భరిస్తూనే మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశా, రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశా. రెండో ఇన్నింగ్స్‌లో అవుటైన తర్వాత టీమ్ మేనేజర్ నన్ను డెంటిస్ట్ దగ్గరికి పంపించాడు... అతను నా పంటిని పీకేశాడు...
88
నేను తిరిగి టీమ్‌తో కలిసి సమయానికి జట్టు మంచి పొజిషన్‌లో ఉంది. ఆ మ్యాచ్‌ని డ్రా చేసుకుని, సిరీస్‌ని 1-0 తేడాతో గెలవగలిగాం. వెస్టిండీస్ గడ్డపై గెలిచిన మొదటి సిరీస్ అదే... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...