నేటి నుంచి రోడ్‌ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2... ఇండియా లెజెండ్స్‌ తరుపున దిగ్గజాలు...

First Published Sep 10, 2022, 5:23 PM IST

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2 నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా కారణంగా మొదటి సీజన్‌ రెండు ఫేజ్‌లుగా జరిగింది. తొలి సీజన్‌లో శ్రీలంకను ఓడించి ఇండియా లెజెండ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. భారత కెప్టెన్‌గా పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు అందుకోని సచిన్ టెండూల్కర్, ఇండియా లెజెండ్స్ కెప్టెన్‌గా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్ గెలిచాడు...

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇండియా లెజెండ్స్‌తో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు... 2022 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొంటున్నాయి... ప్రజలకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ సిరీస్‌కి సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు...

సచిన్ టెండూల్కర్‌ కెప్టెన్‌గా వ్యవహరించే ఇండియా లెజెండ్స్ టీమ్‌లో యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, ఎస్ బద్రీనాథ్, నామన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ, ప్రజ్ఞాన్ ఓజా, వినయ్ కుమార్, రాజేశ్ పవార్, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, రాహుల్ శర్మ పాల్గొంటున్నారు.. 

ఈ ఏడాది వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ వంటి మాజీలు, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కి దూరం కాగా కొన్ని నెలల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా, హర్భజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, రాహుల్ శర్మ  తొలిసారి ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు... 

శ్రీలంక లెజెండ్స్ జట్టుకి తిలకరత్నే దిల్షాన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. సనత్ జయసూర్య, ఉపుల్ తరంగ, చమరా సిల్వ, కౌశల్య వీరరత్నే, మహేళ ఉడవటే, రమేశ్ సిల్వ, ఇసుర ఉదాన, అసేల గుణరత్నే, చమారా కపుగెదెర, నువాన్ కులశేఖర, చమిందా వాస్, దమీకా ప్రసాద్, చతురంగ డి సిల్వ, చితంక జయసింగే, దిల్‌ర్వున్ పెరేరా, దిల్షాన్ మునవీర, ఇషాన్ జయరత్నే, జీవన్ మెండిస్... లంక లెజెండ్స్ టీమ్స్‌లో ఉన్నారు...

road safety

సౌతాఫ్రికా లెజెండ్స్‌ టీమ్‌ని జాంటీ రోడ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే వెస్టిండీస్ టీమ్‌కి బ్రియాన్ లారా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్స్‌కి షేన్ వాట్సన్ కెప్టెన్‌గా ఉంటే, ఇంగ్లాండ్ టీమ్‌ని ఇయాన్ బెల్ నడిపించబోతున్నాడు...

Ross Taylor Virat Kohli

బంగ్లాదేశ్ టీమ్‌ని షాహదత్ హుస్సేన్, న్యూజిలాండ్ టీమ్‌ని రాస్ టేలర్ నడిపించబోతున్నారు. నేడు తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్‌తో తలబడుతోంది ఇండియా లెజెండ్స్. ఆ తర్వాత సెప్టెంబర్ 14న వెస్టిండీస్‌తో, 18న న్యూజిలాండ్ లెజెండ్స్‌తో తలబడుతుంది ఇండియా లెజెండ్స్...

సెప్టెంబర్ 21న బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో, సెప్టెంబర్ 24న ఇంగ్లాండ్ లెజెండ్స్‌తో తలబడుతుంది ఇండియా లెజెండ్స్ టీమ్. సెప్టెంబర్ 28, 29న రాయిపూర్ వేదికగా సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 1న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.  

click me!