కెప్టెన్లకు కలిసి రాని 2019 వన్డే వరల్డ్ కప్... కేన్ విలియంసన్ తప్ప అందరూ అవుట్...

Published : Sep 10, 2022, 03:41 PM IST

ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, వన్డేల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆసీస్‌ వన్డేలకు కొత్త కెప్టెన్‌ని ఎంచుకునే పనిలో పడింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి తర్వాత ఫించ్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని సమాచారం. సోషల్ మీడియా ద్వారా తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు ఆరోన్ ఫించ్..

PREV
19
కెప్టెన్లకు కలిసి రాని 2019 వన్డే వరల్డ్ కప్... కేన్ విలియంసన్ తప్ప అందరూ అవుట్...

తన కెరీర్‌లో 5 టెస్టులు మాత్రమే ఆడిన ఆరోన్ ఫించ్, వన్డేల నుంచి తప్పుకోవడంతో కేవలం టీ20ల్లో మాత్రం కొనసాగబోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న ఆసీస్, ఆ తర్వాత టమిండియా, వెస్టిండీస్‌లతో టీ20 సిరీస్‌లు ఆడనుంది.

29

ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జరుగుతుంది. దీంతో ఆరోన్ ఫించ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటే అతని ప్లేస్‌లో వైట్ బాల్ క్రికెట్‌కి కొత్త కెప్టెన్‌ని ప్రకటించాలని భావిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...

39

‘వన్డే ప్రస్తానం అద్భుతంగా సాగింది. కొందరు ఆల్‌టైం గ్రేట్ ప్లేయర్లతో కలిసి ఆడే అవకాశం దక్కడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. చిన్నతనం నుంచి ఆస్ట్రేలియాకి ఆడాలనేది నా కల. నేను ఆశించిన దానికంటే ఎక్కువ అవకాశాలే నాకు వచ్చాయి. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు..’ అంటూ సోషల్ మీడియా ద్వారా వన్డే రిటైర్మెంట్ గురించి పోస్టు చేశాడు ఆరోన్ ఫించ్...

49

ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్‌పై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘వెల్‌డన్ ఫించీ.. నీతో ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశా. ఆర్‌సీబీ తరుపున ఆడినప్పుడు కూడా... నీ తర్వాతి జీవితాన్ని ఆనందంగా గడుపు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

59
Aaron Finch

35 ఏళ్ల ఆరోన్ ఫించ్ తన కెరీర్‌లో 144 వన్డేలు ఆడి 39.42 సగటుతో 5401 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా 52 వన్డేల్లో 28 విజయాలు అందుకున్న ఆరోన్ ఫించ్, 2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌ని సెమీస్ చేర్చాడు..

69
World Cup captains

ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్‌తో 2019 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్లుగా వ్యవహరించిన వారిలో కేన్ విలియంసన్ ఒక్కడూ తప్ప మిగిలిన వాళ్లెవ్వరికీ కెప్టెన్సీ మిగల్లేదు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌ని కెప్టెన్‌గా నిలిపిన ఇయాన్ మోర్గాన్ పేలవ ఫామ్‌తో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు...

79
Virat Kohli, Sarfaraz Ahmed

2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించగా బంగ్లాదేశ్ నుంచి మిగిలిన అన్ని జట్లు కూడా కెప్టెన్లను మార్చాయి. బంగ్లాదేశ్‌కి ముష్‌రఫే మోర్తాజా, ఆఫ్ఘనిస్తాన్‌కి గుల్బాదిన్ నైబ్, పాకిస్తాన్ జట్టుకి సర్ఫరాజ్ అహ్మద్... కెప్టెన్లుగా వ్యవహరించారు.  అయితే ఆ టోర్నీ తర్వాత వీళ్లు కెప్టెన్సీని కోల్పోయి, టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోవాల్సి వచ్చింది...

89
Virat Kohli, Aaron Finch, Eoin Morgan, Kane Williamson

సౌతాఫ్రికా జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లిసిస్, ఆ టోర్నీ తర్వాత టీమ్‌లో ప్లేస్ దక్కించుకోలేకపోతున్నాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్‌ కరుణరత్నే ప్రస్తుతం టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్, కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది...

99

2019 వన్డే వరల్డ్ కప్ ముగిసిన మూడేళ్లలో అప్పటి కెప్టెన్లు ఎవ్వరూ మిగలకపోయినా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ మాత్రం నాటి నుంచి నేటి వరకూ మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఏడాదిన్నరగా పేలవ ఫామ్‌తో పరుగులు చేయలేకపోతున్న కేన్ విలియంసన్ కూడా త్వరలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది...  

Read more Photos on
click me!

Recommended Stories