అప్పుడు పంత్‌కి వైస్ కెప్టెన్సీ ఇచ్చి, ఇప్పుడు పూజారాకి... టీమిండియా నిర్ణయంపై మహ్మద్ కైఫ్ షాక్..

First Published Dec 14, 2022, 12:14 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో మొదటి రెండు వన్డేల్లో ఓడినా మూడో వన్డేలో ఘన విజయం అందుకున్న టీమిండియా... టెస్టు సిరీస్‌ ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది. రోహిత్ శర్మ గాయంతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో తొలి టెస్టుకి కెఎల్ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సీనియర్ ఛతేశ్వర్ పూజారాకి వైస్ కెప్టెన్సీ దక్కింది...

ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన ఐదో టెస్టుకి ముందు కూడా రోహిత్ శర్మ గాయపడ్డాడు. కెఎల్ రాహుల్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ టెస్టు మ్యాచ్‌కి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే బుమ్రా గాయంతో రెండు నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్నాడు...
 

Rishabh Pant-Pujara

జస్ప్రిత్ బుమ్రా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. అయితే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకి మాత్రం రిషబ్ పంత్‌ని కాదని, ఛతేశ్వర్ పూజారాని వైస్ కెప్టెన్‌గా నియమించింది టీమిండియా...

‘ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇండియా ఆడిన లాస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. లెక్క ప్రకారం అతనికి టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలి. పోనీ కెఎల్ రాహుల్‌ రీఎంట్రీ ఇచ్చాడని అతనికి కెప్టెన్సీ అప్పగించారనుకుందాం. మరి రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారు...

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పూజారా కూడా ఉన్నాడు. అప్పుడు ఛతేశ్వర్ పూజారాకి వైస్ కెప్టెన్సీ ఇవ్వనివాళ్లు, ఇప్పుడు రిషబ్ పంత్‌ని కాదని అతనికి ఎందుకిచ్చారు. అప్పుడు జూనియర్‌కి వైస్ కెప్టెన్సీ ఇచ్చి తప్పు చేశామని అనుకున్నారా? లేక రాహుల్‌కి సీనియర్ సలహాలు కావాలని పూజారాకి వైస్ కెప్టెన్సీ పదవి ఇచ్చారా...

టీమిండియా ఎందుకు ఇంత హడావుడి నిర్ణయాలు తీసుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు. రిషబ్ పంత్‌ని కెప్టెన్‌ని చేయాలని తొందరపడుతున్నారా? అతను ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతున్నాడు...

Rishabh Pant

అవును, రిషబ్ పంత్ మ్యాచ్ విన్నరే. అయితే అతన్ని కెప్టెన్‌ని చేయడానికి చాలా సమయం ఉంది. భారత ప్లేయర్ల పర్ఫామెన్స్‌పై అతిగా ఫోకస్ పెట్టడం వల్లే వాళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

click me!