BCCI: బీసీసీఐ ట్విటర్ ఖాతాకు గోల్డ్ కలర్ టిక్.. అంత స్పెషల్ ఎందుకో తెలుసా..?

First Published Dec 13, 2022, 6:34 PM IST

Twitter Blue Tick: ప్రపంచ అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్  ట్విటర్  ను దక్కించుకున్న తర్వాత  ఆ సంస్థలో  మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇన్నాళ్లు  బ్లూ  టిక్ లో ఉన్న టిక్ మార్క్ ఇప్పుడు గోల్డ్ టిక్ లో మారింది. ఎందుకు..?  ఉన్నఫళంగా  బీసీసీఐ వెరీఫైడ్ టిక్ కలర్ మారడానికి కారణాలేంటి..? 

ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు గా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ట్విటర్ ఖాతాను చూశారా..?  ఇన్నాళ్లు  బ్లూ టిక్ లో ఉన్న మార్క్  ఇప్పుడు గోల్డ్ టిక్ లో మారింది. ఎందుకు..?  ఉన్నఫళంగా  బీసీసీఐ వెరీఫైడ్ టిక్ కలర్ మారడానికి కారణాలేంటి..? 

ప్రపంచ అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్  ట్విటర్  ను దక్కించుకున్న తర్వాత  ఆ సంస్థలో  మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సోషల్ మైక్రో బ్లాగింగ్ సైట్ లో అంతకుముందు వెరీఫైడ్ ఖాతాలకు బ్లూ టిక్ కనబడేది. 

మస్క్ వచ్చిన తర్వాత ఈ బ్లూ టిక్ కావాలనుకుంటే  8 యూఎస్ డాలర్లు చెల్లించాలని కండీషన్ పెట్టాడు.   అయితే గతంలో  అఫిషియల్ ఖాతాలన్నింటికీ  బ్లూ టిక్ లే ఉండేవి. కానీ ఇప్పుడు  మస్క్ ఆ పద్ధతిని మార్చాడు. కొత్త రూల్ ప్రకారం   ట్విటర్ లో వ్యక్తులు,  సంస్థలు, కంపెనీలను విభజించాడు.   ఒక్కొక్కరికి ఒక్కో  కలర్ వెరీఫైడ్ టిక్ ఉంటుంది. 
 

డిసెంబర్ 13 నుంచి  ఈ మార్పులు ఇండియాలో మొదలయ్యాయి. ట్విటర్ కొత్త పాలసీ ప్రకారం.. వెరీఫైడ్ కంపెనీస్, అఫిషియల్ బిజినెస్ అకౌంట్స్ కు గోల్డ్ టిక్ ను కేటాయించారు.  ఇక గవర్నమెంట్ అకౌంట్స్ కు గ్రే కలర్ ను  ఇవ్వగా ఇండివిడ్యూవల్ (వ్యక్తిగత ఖాతాలకు)  బ్లూ కలర్ టిక్ ప్రత్యక్షమైంది. 

ఈ మార్పులలో భాగంగానే బీసీసీఐ ట్విటర్ ఖాతా వెరీఫైడ్ టిక్ గోల్డ్ కలర్ లో కనబడుతున్నది.  బీసీసీఐ  స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది ప్రభుత్వ పరిధిలోకి రాదు.  సాధారణంగా  మిగిలిన క్రీడలన్నీ  నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కిందకు వస్తాయి.  కానీ బీసీసీఐ మాత్రం  ప్రత్యేకం. దీనిపై ప్రభుత్వ పెత్తనం ఉండదు. 
 

మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా   (సాయ్) మీడియా  అఫిషియల్ ట్విటర్ ఖాతా చూస్తే ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది.  సాయ్ కు వెరీఫైడ్ టిక్  బ్లూ కలర్ లోనే ఉండటం గమనార్హం. సాయ్ తో పాటు ప్రభుత్వ అధీనంలో   ఉన్న  ప్రతీ స్పోర్ట్స్ అసోసియేషన్ కు  బ్లూ టిక్ అలాగే  ఉంది. 

ఇదిలాఉండగా   హార్ధిక్ పాండ్యా తో పాటు క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే   ల ట్విటర్ ఖాతాలు మాత్రం  ట్విటర్ పాలసీ  లో పేర్కొన్నట్టుగా  బ్లూ కలర్ లో కాకుండా గోల్డ్ కలర్ లో దర్శనమివ్వడం కొంత అయోమయానికి దారితీస్తున్నది. అసలు  ట్విటర్ ను మస్క్ మామ  (సోషల్ మీడియాలో మస్క్ ను అభిమానులు పిలుచుకునే పేరు)  ఏం చేయాలనుకుంటున్నాడోనని   నెటిజన్లు  కామెంట్స్ చేస్తున్నారు. 
 

click me!