ఇష్టమైన ఫార్మాట్‌లో కష్టంగా ఆడుతున్న విరాట్ కోహ్లీ... మూడేళ్లుగా దారుణంగా పడిపోయిన...

First Published Dec 14, 2022, 11:45 AM IST

ఒక్కో ప్లేయర్, ఒక్కో ఫార్మాట్‌లో బాగా ఆడతాడు. రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్‌లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేస్తే, జో రూట్, స్టీవ్ స్మిత్ వంటి ప్లేయర్లు టెస్టుల్లో దుమ్మురేపుతారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టేవాడు. వన్డేల్లో 44, టీ20ల్లో అదిరిపోయే రికార్డులు ఉన్నా.. కోహ్లీకి టెస్టులు అంటేనే ప్రత్యేకమైన అభిమానం..

మహేంద్ర సింగ్ ధోనీ అర్ధాంతంగా తప్పుకోవడంతో 2014లోనే టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ... ఆరేళ్ల పాటు టీమిండియాని నెం.1 టెస్టు టీమ్‌గా నిలిపాడు. కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కూడా ఆడింది..

అయితే విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌లో పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతుండడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2019 నవంబర్‌లో చివరిగా టెస్టుల్లో సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ. మూడేళ్లుగా విరాట్ బ్యాటు నుంచి టెస్టు సెంచరీ రాలేదు...

32 ఇన్నింగ్స్‌ల్లో టెస్టు సెంచరీ చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ. విరాట్ 27వ టెస్టు సెంచరీ అందుకున్న సమయంలో జో రూట్ 20 టెస్టు సెంచరీలు మాత్రమే చేశాడు. ఇప్పుడు జో రూట్ ఖాతాలో 28 టెస్టు సెంచరీలు ఉన్నాయి...

అలాగే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా 26 సెంచరీలతో విరాట్ కోహ్లీ కంటే వెనకే ఉండేవాడు. అయితే ఈ గ్యాప్‌లో 3 టెస్టు సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్, 29 టెస్టు శతకాలతో  ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన ప్లేయర్‌గా ఉన్నాడు... విరాట్ కోహ్లీ మాత్రం అక్కడే ఉండిపోయాడు...

Image credit: Getty

వన్డే ఫార్మాట్‌లో 12 వేలకు పైగా పరుగులు, టీ20ల్లో 4 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో 10వేల పరుగుల క్లబ్‌లో చేరాలని తెగ ఆశపడుతున్నాడు. అయితే 2020 నుంచి కోహ్లీ టెస్టు గణాంకాలు ఏ మాత్రం సరిగ్గా లేవు...

Image credit: Getty

2020 నుంచి ఇప్పటివరకూ 19 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ, 33 ఇన్నింగ్స్‌ల్లో 873 పరుగులు చేశాడు. మూడేళ్లుగా విరాట్ టెస్టు సగటు 26.45 మాత్రమే. ఆసియా కప్ తర్వాత వన్డే, టీ20ల్లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... తనకి ఇష్టమైన ఫార్మాట్‌లో మాత్రం పరుగులు చేయడానికి తెగ కష్టపడుతున్నారు...
 

బంగ్లాతో టెస్టు సిరీస్‌లో అయినా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడేమోనని భావించారు అభిమానులు. అయితే తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5 బంతులాడి 1 పరుగుకే పెవిలియన్ చేరాడు కోహ్లీ. రెండో ఇన్నింగ్స్‌లో అయినా విరాట్ బ్యాటు నుంచి మంచి ఇన్నింగ్స్ వస్తుందా? లేదో చూడాలి.. 

click me!