టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒకడు. టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, దూకుడుగా ఆడే రిషబ్ పంత్, టీ20లకు వచ్చేసరికి టెస్టు ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఇంప్రెస్ చేయలేకపోయిన రిషబ్ పంత్, ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్‌కి చేరుకున్నాడు...
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లాడు రిషబ్ పంత్. శ్రేయాస్ అయ్యర్, ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆడినా ఆడకపోయినా ఫిట్‌గా ఉంటే రిషబ్ పంత్‌కి టెస్టు టీమ్‌లో చోటు గ్యారెంటీ...
27
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత టీమిండయా టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న రిషబ్ పంత్, సిడ్నీ, బ్రిస్బేన్‌లలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. గత ఇంగ్లాండ్ టూర్‌లో ఆకట్టుకున్నాడు...
37
ఐదో టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు కూడా ఆడబోతోంది భారత జట్టు. ప్రస్తుతం గాయానికి చికిత్స కోసం జర్మనీ చేరుకున్న కెఎల్ రాహుల్, టీ20 సిరీస్ సమయానికి జట్టుకి అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది మేనేజ్‌మెంట్...
47
Image credit: PTI
ఒకవేళ కెఎల్ రాహుల్ కోలుకోకపోతే రిషబ్ పంత్‌ని టీ20ల్లో ఓపెనింగ్ చేయించాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు...
57
Image credit: PTI
‘రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్‌గా మారిన తర్వాతే టీ20ల్లో సెంచరీలు చేశాడు. కాబట్టి మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేయలేకపోతున్న రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా పంపిస్తే, రాణించే అవకాశం ఉంది.
67
Image credit: PTI
రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా పంపిస్తే.. రైట్ హ్యండ్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ కాంబినేషన్‌కి కూడా వర్కవుట్ అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ బంగర్...
77
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రిషబ్ పంత్, బ్యాటింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా 57 పరుగులు మాత్రమే చేసిన రిషబ్ పంత్, తొలి టీ20లో 29 పరుగులు చేయడం మినహా పెద్దగా రాణించలేదు..