అక్కడ ఉన్నప్పుడు నరకంలో ఉన్నట్టే అనిపించింది... పీఎస్‌ఎల్‌పై జాసన్ రాయ్ కామెంట్...

Published : Jun 21, 2022, 03:30 PM IST

ఐపీఎల్‌లో ఆడడం వల్లే తాము అద్భుతంగా ఆడుతున్నామని జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో వంటి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు కామెంట్ చేస్తే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే మాది తోపు లీగ్ అని చెప్పుకునే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు జాసన్ రాయ్... పీఎస్‌ఎల్‌లో పరుగులు చేసినా, ఎంజాయ్ చేయలేకపోయానని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు...

PREV
17
అక్కడ ఉన్నప్పుడు నరకంలో ఉన్నట్టే అనిపించింది... పీఎస్‌ఎల్‌పై జాసన్ రాయ్ కామెంట్...
Jason Roy

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన జాసన్ రాయ్‌ని, ఈసారి గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే టోర్నీ ఆరంభానికి ముందే బయో బబుల్ భయంతో ఐపీఎల్ 2022 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు జాసన్ రాయ్...

27
Jason Roy

అయితే ఐపీఎల్‌కి ముందు జరిగిన పీఎస్‌ఎల్ 2022 సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ తరుపున ఆడాడు జాసన్ రాయ్. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలోని క్వెట్టా గ్లాడియేటర్స్, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది...

37

‘నేను పీఎస్‌ఎల్‌లో ఉన్నప్పుడు అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను. మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నేను బాగా ఆడుతున్నా, పరుగులు వస్తున్నా, దాన్ని ఎంజాయ్ చేయలేకపోయా...

47

Jason Roy

ఎందుకో తెలీదు, నరకంలో ఉన్నట్టే అనిపించింది. అది నాకు చాలా చీకటి సమయం. అందుకే ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం నాకు బాగా కలిసి వచ్చింది. ఇంట్లో రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపిన తర్వాత మళ్లీ నార్మల్ అయ్యా...

57

కొన్నేళ్లుగా బయో బబుల్ జీవితానికి అలవాటు పడిన నాకు, ఈ రెండు నెలల గ్యాప్ ఎంతో ప్రశాంతంగా మనసుకి రిలాక్స్‌గా అనిపించింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు జాసన్ రాయ్...

67

31 ఏళ్ల జాసన్ రాయ్, నెదర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌తో 100 వన్డేలను పూర్తి చేసుకున్నాడు. 236 పరుగుల లక్ష్యఛేదనలో 60 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 73 పరుగులు చేసిన జాసన్ రాయ్... తన 100వ వన్డేలో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు...

77

‘నా మొదటి గేమ్ కంటే నా వందో గేమ్ ఇన్నింగ్స్ చాలా సంతృప్తినిచ్చింది. 100 మ్యాచులు ఆడానంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులు, టీమ్‌కి విజయాన్ని అందించడం మరింత సంతృప్తిని అందించాయి..’ అంటూ చెప్పుకొచ్చాడు జాసన్ రాయ్..

click me!

Recommended Stories