దినేశ్ కార్తీక్ బాటలో మురళీ విజయ్... 38 ఏళ్ల వయసులో క్రికెట్‌లో రీఎంట్రీ కోసం ప్రయత్నాలు...

Published : Jun 21, 2022, 03:58 PM IST

ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళీ విజయ్, దినేశ్ కార్తీక్... ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితతో మురళీ విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకుని, వారిద్దరూ విడిపోవడానికి కారణమవ్వడం భారత క్రికెట్‌లో పెను సంచలనం క్రియేట్ చేసింది...

PREV
17
దినేశ్ కార్తీక్ బాటలో మురళీ విజయ్... 38 ఏళ్ల వయసులో క్రికెట్‌లో రీఎంట్రీ కోసం ప్రయత్నాలు...

మురళీ విజయ్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్న దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి... మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే...
 

27

37 ఏళ్ల వయసులో దినేశ్ కార్తీక్, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంతో 38 ఏళ్ల మురళీ విజయ్ కూడా క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. త్వరలో ప్రారంభం కాబోయే తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్-2022)లో పాల్గొనబోతున్నాడు మురళీ విజయ్...

37

‘ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని అనుకుంటున్నా. నేను నా క్రికెట్‌ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే ఎలాంటి లక్ష్యాలు లేవు. బ్యాటింగ్ చేసేందుకు అవసరమైన ఫిట్‌నెస్ నాకు ఉంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు మురళీ విజయ్...

47

2008లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్, 2018లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా టెస్టు ఓపెనర్‌గా మారాడు మురళీ విజయ్...
 

57

61 టెస్టుల్లో 38.29 సగటుతో 3982 పరుగులు చేసిన మురళీ విజయ్, 12 సెంచరీలు, 15  హాఫ్ సెంచరీలు సాధించాడు. 17 వన్డేలు ఆడిన మురళీ విజయ్, ఓ హాఫ్ సెంచరీతో 339 పరుగులు చేశాడు. టీ20ల్లో పెద్దగా రాణించలేకపోయినా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్‌గా వ్యవహరించాడు మురళీ విజయ్...
 

67

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకి ఆడిన మురళీ విజయ్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 8 సీజన్లు ఆడాడు. 2020 సీజన్ తర్వాత ఐపీఎల్ వేలంలో గత రెండు సీజన్లలోనూ మురళీ విజయ్ అమ్ముడుపోలేదు.

77

వరుణ్ చక్రవర్తి, టి నటరాజన్ వంటి క్రికెటర్లు వెలుగులోకి వచ్చి... ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వడానికి వేదికగా నిలిచింది తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్). మరి మురళీ విజయ్ రీఎంట్రీ ఈ లీగ్ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి...

click me!

Recommended Stories