టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రిషబ్ పంత్ కంటే ఎక్కువ మ్యాచులు ఆడాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. మొదటి నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన దినేశ్ కార్తీక్, ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు అంతకుముందు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రిషబ్ పంత్‌కి చోటు దక్కింది... ఆ రెండింట్లో అతను ఫెయిల్ అయ్యాడు.
37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కించుకోవడమే చాలా పెద్ద విశేషం. అయితే అందివచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని దినేశ్ కార్తీక్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు...
28
Image credit: PTI
బ్యాటర్‌గానే కాకుండా ఫినిషర్‌గానూ దినేశ్ కార్తీక్ నుంచి టీమిండియా ఆశించిన మెరుపులైతే రాలేదు. దీంతో దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టే. అందరూ అనుకున్నట్టుగానే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో దినేశ్ కార్తీక్‌కి చోటు దక్కలేదు...
38
దీంతో తిరిగి కామెంటేటర్‌గా తన పాత పొజిషన్‌కి వెళ్లిపోవాలని చూస్తున్నాడు దినేశ్ కార్తీక్. త్వరలో ఈ సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పొజిషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు దినేశ్ కార్తీక్...
48
Rishabh Pant
‘రిషబ్ పంత్ సామర్థ్యం గురించి మనందరికీ బాగా తెలుసు. బౌలర్ ఎవ్వరైనా పంత్ ఈజీగా షాట్లు ఆడగలడు. అలాంటి ప్లేయర్‌ని పవర్ ప్లేలో వాడుకోవాలి. ఓపెనింగ్ చేయిస్తే రిషబ్ పంత్, టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీ20 ఓపెనర్‌గా మారతాడు..
58
Image credit: Getty
అంతేకాకుండా ఓపెనింగ్ చేసిన సందర్భాల్లో రిషబ్ పంత్ స్ట్రైయిక్ రేటు కూడా బాగుంది. పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడాన్ని పంత్ బాగా ఎంజాయ్ చేస్తాడు, బౌండరీలు బాదుతూ ఒత్తిడిని బౌలర్లపైకి నెట్టేస్తాడు...
68
Image credit: Getty
ఓపెనర్‌గా ఆడించకపోతే రిషబ్ పంత్ ఏ పొజిషన్‌లో కుదురుకుంటాడో చూడాలి. సంజూ శాంసన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు... న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా...
78
Sanju Samson and Rishabh Pant
టాపార్డర్‌లో పంత్‌ని వాడుకుంటే బెటర్. టెస్టుల్లో రిషబ్ పంత్ ప్లేస్‌కి ఢోకా లేదు. వన్డే క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20ల్లో మాత్రం బ్యాటింగ్ పొజిషన్ కారణంగా సరిగ్గా రాణించలేకపోతున్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఢిల్లీకి టాపార్డర్‌లో వస్తాడు, టీమిండియాకి మిడిల్ ఆర్డర్‌లో వస్తాడు...
88
Image credit: Getty
రిషబ్ పంత్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓ ప్లేస్ ఫిక్స్ చేస్తే... కాస్త సమయం తీసుకున్నా అందులో అతను సెటిల్ అవుతాడు. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాతో పాటు విరాట్ కోహ్లీ మరో రెండేళ్లు ఆడతాడని అనుకుంటున్నా... మరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ పంత్‌ని ఎలా వాడతారో చూడాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్..