టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయం తర్వాత టీమిండియా సెలక్షన్ కమిటీని తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఛీఫ్ సెలక్షన్ చేతన్ శర్మతో పాటు నలుగురు సెలక్షన్ కమిటీ సభ్యులను తప్పించింది భారత క్రికెట్ బోర్డు. సెలక్షన్ కమిటీని తప్పించడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి... అందులో ముఖ్యమైనది విరాట్ కోహ్లీతో వ్యవహరించిన విధానం...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విధానం, బీసీసీఐ కొత్త మేనేజ్‌మెంట్‌కి ఏ మాత్రం నచ్చలేదట... వన్డేల్లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసి, టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా ఉన్న భారత సారథిని ఇలా చెప్పా పెట్టకుండా తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని రోజర్ బిన్నీ అండ్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం..
27
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. అయితే ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు, టీమ్‌ని ప్రకటించడానికి 15 నిమిషాల ముందు తనకు తెలియచేసినట్టు వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ..
37
ఈ విషయంలో బీసీసీఐకి, విరాట్ కోహ్లీ మధ్య చాలా వాదనలు జరిగాయి. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటుంటే వద్దని తాను వారించానని సౌరవ్ గంగూలీ కామెంట్ చేశాడు. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పగానే ఎవ్వరూ అడ్డుచెప్పలేదని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ విషయం మీద అప్పట్లో చాలా పెద్ద హై డ్రామానే నడిచింది...
47
Image credit: Getty
విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీయే కారణమని వినిపించింది. అయితే విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది... అనవసర ప్రయోగాలతో మొదటికే మోసం వచ్చింది...
57
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ఏడాది కూడా గడవకుండా బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోయాడు సౌరవ్ గంగూలీ. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా మరికొంత కాలం కొనసాగాలని గంగూలీ ఆశపడినా, బోర్డు సభ్యులు అతన్ని బలవంతంగా ఆ పదవి నుంచి తప్పించారు...
67
2021, నవంబర్ 18న చేతన్ శర్మ ఆధ్వర్యంలోనే సెలక్షన్ కమిటీ, విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంటే... సరిగ్గా ఏడాది 2022, నవంబర్ 18న సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ కొత్త మేనేజ్‌మెంట్...
77
విరాట్ కోహ్లీని చేటు చేయాలని చూసి, అవమానించిన వారందరూ ‘కర్మ’ ఫలితాన్ని అనుభవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాజీ కెప్టెన్ అభిమానులు. బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక్కడూ మిగిలాడని, అతన్ని కూడా తప్పిస్తే... క్లైమాక్స్ అదిరిపోతుందని కామెంట్లు చేస్తున్నారు..