టీ20లకు హార్దిక్ పాండ్యా, టెస్టుల్లో రిషబ్ పంత్, వన్డేలకు రోహిత్ శర్మ... టీమిండియా కెప్టెన్సీ మార్పుకి...

First Published Nov 19, 2022, 12:12 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయంతో టీమిండియాలో దిద్దుబాటు చర్యలు మొదలైపోయాయి. ఇప్పటికే సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ, త్వరలో కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. మిగిలిన జట్లకి భిన్నంగా మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి...
 

2021 నవంబర్‌లో విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ... ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ని ప్రకటించారు సెలక్టర్లు... అయితే అదే పర్యటనలో టెస్టు కెప్టెన్సీని వదులుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా... ఇలా సిరీస్‌కో కెప్టెన్‌ని మారుస్తూ సాగుతోంది టీమిండియా కథ. ఫిట్‌నెస్ కారణాలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాటిమాటికి విశ్రాంతి తీసుకుంటుండడంతో కొత్త కెప్టెన్లను నియమించాల్సి వస్తోంది...

Hardik Pandya, rohith sharma

దీంతో రోహిత్ శర్మకు వర్క్‌లోడ్ తగ్గించడంతో పాటు 2024 టీ20 వరల్డ్ కప్‌కి ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. ఇందులో భాగంగా హార్ధిక్ పాండ్యాకి టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందించబోతున్నారని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన రానుంది...

వచ్చే ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఆ టోర్నీ వరకూ మాత్రం వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తే.. అతను ఉన్నన్ని రోజులు వన్డేల్లో సారథిగా ఉండే అవకాశాలు ఉన్నాయి...

Rishabh Pant

36 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగడం కష్టమని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో టెస్టు కెప్టెన్సీ పగ్గాలను జస్ప్రిత్ బుమ్రా, లేదా రిషబ్ పంత్‌లకు అందించాలని ఆలోచనలు చేస్తోందట భారత క్రికెట్ బోర్డు. జస్ప్రిత్ బుమ్రా కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతుండడంతో రిషబ్ పంత్, టెస్టు కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడట...

Rishabh Pant-Rohit Sharma

టీ20ల్లో హార్ధిక్ పాండ్యా, వన్డేల్లో రోహిత్ శర్మ, టెస్టుల్లో రిషబ్ పంత్ కెప్టెన్లుగా బాధ్యతలు అందుకోబోతున్నారని... వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత వైట్ బాల్ క్రికెట్‌కి హార్ధిక్ పాండ్యా, రెడ్ బాల్ క్రికెట్‌కి రిషబ్ పంత్ సారథులుగా ఉంటారని వార్తలు వస్తున్నాయి...

click me!