ఈ పిల్లాడిని ఫ్రీగా వదిలేయండి... రిషబ్ పంత్ బ్యాటింగ్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్...

First Published Jan 13, 2022, 7:07 PM IST

ఎక్కడ ఫెయిల్ అయ్యాడో, అక్కడే జెండా పాతేవాడే అసలైన విన్నర్. ఇప్పుడు కేప్ టౌన్‌లో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ అలాంటిదే...  సౌతాఫ్రికా టూర్‌లో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాడు రిషబ్ పంత్. వరుసగా ఫెయిల్ అవుతుండడంతో జట్టులో అతని స్థానంపై కూడా ట్రోలింగ్ వచ్చింది...

షాట్ సెలక్షన్‌లో రిషబ్ పంత్ చేస్తున్న పొరపాట్ల కారణంగా లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతూ వచ్చాడు...

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 34 పరుగులు మినహా... సెన్సేషనల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ నుంచి చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ రాలేదు...

చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకుంటున్న రిషబ్ పంత్‌కి బదులుగా కాన్పూర్ టెస్టులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇస్తే బెటరని కూడా విమర్శలు వచ్చాయి...

అయితే కీలక సమయంలో తనదైన స్టైల్‌లో సత్తా చాటి, విమర్శకుల నోళ్లకు తాళాలు వేశాడు రిషబ్ పంత్... కేప్ టౌన్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్...

కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కి అమూల్యమైన 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌ ఆడాడు...

బ్యాటింగ్‌కి పెద్దగా సహకరించిన పిచ్‌లో చాలా తేలిగ్గా బౌండరీలు బాదుతూ, సౌతాఫ్రికా బౌలర్లపై ఒత్తిడి పెంచాడు రిషబ్ పంత్... 

ఓ ఎండ్‌లో విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ, విసిగిస్తే... మరో ఎండ్‌లో రిషబ్ పంత్ మాత్రం వీరేంద్ర సెహ్వాగ్‌లా బౌండరీలతోనే డీల్ చేశాడు...

కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే, అందులో విరాట్ చేసింది 15 పరుగులే... పూర్తిగా రిషబ్ పంత్ డామినేషనే కనిపించింది.

కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన రిషబ్ పంత్, చాలా సెలక్టివ్‌గా షాట్‌ ఆడాల్సిన బంతులను ఎంచుకుని, పర్ఫెక్ట్‌గా బౌండరీలు రాబట్టగలిగాడు...

విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత రవి అశ్విన్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్ స్టైల్‌ మార్చి... బౌండరీలతోనే డీల్ చేయడం మొదలెట్టాడు రిషబ్ పంత్...

రబాడా బౌలింగ్‌లో ఫోర్ బాది 98 పరుగులకు చేరుకున్న రిషబ్ పంత్, ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 
 

సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. 2010లో సెంచూరియన్‌లో 90 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించాడు రిషబ్ పంత్...

ఇంగ్లాండ్‌లో (114), ఆస్ట్రేలియాలో (159) పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచిన రిషబ్ పంత్, సౌతాఫ్రికా గడ్డ మీద కూడా ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 
 

133 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన మొదటి ఆసియా వికెట్ కీపర్‌గా నిలిచాడు.

అంతేకాదు ఒకే ఇన్నింగ్స్‌లో రెండు కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత వికెట్ కీపర్‌గానూ నిలిచాడు రిషబ్ పంత్...

‘ఈ పిల్లాడిని ఇలా ఫ్రీగా వదిలేయండి... టెస్టు క్రికెట్ ప్రపంచంలో ది బిగ్గస్ట్ మ్యాచ్ విన్నర్లలో ఒకడు...  రిషబ్ పంత్’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

click me!