ఆ కుర్ర స్పిన్నర్‌పై కన్నేసిన కెఎల్ రాహుల్... యజ్వేంద్ర చాహాల్, రషీద్‌ ఖాన్‌ల ప్లేస్‌లో రవి భిష్ణోయ్...

First Published Jan 13, 2022, 5:22 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి రెండు నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ మొదలైంది. కొత్తగా రానున్న జట్లకి ‘ఫ్రీ టికెట్’ ద్వారా వేలానికి ముందుగానే ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది ఐపీఎల్. ఈ నెలఖారుతో ఆ గడువు కాస్త ముగియనుంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రానున్న అహ్మదాబాద్, లక్నో ఫ్రాంఛైజీలు వేలానికి ముందుగానే కెప్టెన్లను, మరో ఇద్దరు ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి...

అహ్మదాబాద్ జట్టుకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, కాదు కాదు... హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి...

లక్నో జట్టు కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ పేరు మాత్రమే చాలా రోజులుగా వినిపిస్తోంది. పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌కి రూ.20 కోట్లు చెల్లించడానికి సిద్ధమైందట లక్నో ఫ్రాంఛైజీ...

ఆఫ్ఘాన్ యంగ్ సంచలనం రషీద్ ఖాన్‌తో పాటు హార్ధిక్ పాండ్యా కూడా లక్నో జట్టుకే వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరూ అహ్మదాబాద్‌ జట్టుకి మారినట్టు సమాచారం...

రషీద్ ఖాన్ ఫస్ట్ రిటెన్షన్‌గా రూ.15 కోట్లు కోరుకోవడంతో కెఎల్ రాహుల్‌కి ఆ ప్లేస్ దక్కడంతో ఈ ఆఫ్ఘాన్ స్పిన్నర్ లక్నో నుంచి అహ్మదాబాద్‌కి మారాడని వార్తలు వినిపిస్తున్నాయి...

అలాగే భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ పేరు కూడా లక్నో జట్టులో చేరుతున్నట్టు వినిపించింది. అయితే అతనికి కూడా కెఎల్ రాహుల్ చెక్ పెట్టాడట...

పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున అద్భుతంగా రాణించిన యంగ్ స్నిన్నర్ రవిభిష్ణోయ్‌‌, లక్నో జట్టుకి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది...

అండర్19 వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన రవిభిష్ణోయ్, మొదటి సీజన్‌లోనే 12 వికెట్లు తీసి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు గెలిచాడు...

రవిభిష్ణోయ్‌తో పాటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌ కూడా లక్నో ఫ్రాంఛైజీ తరుపున ఆడబోతున్నాడని టాక్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో అటు బంతితో, ఇటు బ్యాటుతో రాణించిన స్టోయినిస్... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలిసారి ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.

click me!